ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎయిర్‌పోర్టులో జింకల చర్మం పట్టివేత

ABN, First Publish Date - 2023-10-08T23:57:57+05:30

శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్తూరి జింక చర్మాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు.

స్వాధీనం చేసుకున్న జింక చర్మం

శంషాబాద్‌ రూరల్‌, అక్టోబరు 8: శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్తూరి జింక చర్మాన్ని అక్రమంగా తరలిస్తుండగా కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన అక్బర్‌ పాషా ఆదివారం ఎయిర్‌పోర్టు నుంచి ముంబాయి వెళ్తున్నాడు. కస్టమ్స్‌ అధికారులు అతడి లగేజీని తనిఖీ చేయగా రెండు కస్తూరి జింకల చర్మాన్ని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి విచారించగా జింకల చర్మం క్షుద్రపూజల కోసం తరలించిన్నట్లు తేలింది. పట్టుకున్న జింక చర్మాలను ఆటవీ శాఖ అధికారులకు అప్పగించారు. ఫారెస్ట్‌, వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.

విదేశీ కరెన్సీ స్వాధీనం

శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విదేశ కరెన్సీని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన అరిఫ్‌ హుస్సేన్‌(60) ఈ నెల 6న శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి కొలంబో వెళ్లేందుకు ఎయిర్‌పోర్టు చేరుకున్నారు. కస్టమ్స్‌ తనిఖీలు చేయగా అతడి వద్ద పరిమితికి మించి ఉన్న యూఎస్‌ డాలర్లు, థాయిలాండ్‌ బాత్‌ కరెన్సీ మొత్తం రూ.9.9లక్షలు కరెన్సీని పట్టుకున్నారు. వాటి వివరాలు లేకపోవడంతో విదేశీ కరెన్సీని సీజ్‌ చేశారు.

Updated Date - 2023-10-08T23:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising