తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దేశానికి ఆదర్శం
ABN, First Publish Date - 2023-02-19T23:28:01+05:30
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 19: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర 29వ రోజు ఆదివారం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కొనసాగింది. ఈ సందర్భంగా ఇక్కడ చౌరస్తాలో రాత్రి జరిగిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజల అవసరాలకనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారని ఆమె గుర్తు చేశారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యనందించడానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ.. వారి సమస్యలు తెలుసుకోవడానికి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి ‘ప్రగతి నివేదన యాత్ర’ చేపట్టడం అభినందనీయమని ఆమె అన్నారు.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం చెరువును సుందరీకరిస్తూ పర్యాటకంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే పనులు చేపడతామన్నారు. ఇబ్రహీంపట్నం చౌరస్తా నుంచి నాగన్‌పల్లి, పాతబస్తీ గుండా రాయపోల్ రోడ్డు చివరివరకు రోడ్డును విస్తరించనున్నట్లు ఆయన చెప్పారు. ప్రశాంత్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఈ యాత్రను రాజకీయ కోణంలో చూడొద్దన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ యాత్ర కొనసాగిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేష్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు అల్వాల వెంకట్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలు నల్లబోలు మమత, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదిగిరి, ఎంపీపీ కృపేష్, జడ్పీటీసీ జంగమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రయ్య, మున్సిపల్ కార్యదర్శి వేణుగోపాల్‌రావు, కౌన్సిలర్లు జెర్కోని బాల్‌రాజ్, భానుబాబు, పద్మామలేష్ యాదవ్, ప్రసన్నలక్ష్మి, భర్తాకి జగన్, యాచారం సుజాత, మంద సుధాకర్, జెర్కోని రాజు తదితరులున్నారు.
Updated Date - 2023-02-19T23:28:02+05:30 IST