ఊరెళ్లను చేవెళ్ల మున్సిపాలిటీలో విలీనం చేయొద్దు
ABN, First Publish Date - 2023-07-17T23:14:34+05:30
నూతనంగా ఏర్పాటు కాబోతున్న చేవెళ్ల మున్సిపాలిటీలో ఊరెళ్ల గ్రామాన్ని వీలినం చేయొద్దని గ్రామంలోని పలువురు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఊరెళ్లలో నిరసన వ్యక్తం గ్రామస్తులు
చేవెళ్ల, జూలై 17: నూతనంగా ఏర్పాటు కాబోతున్న చేవెళ్ల మున్సిపాలిటీలో ఊరెళ్ల గ్రామాన్ని వీలినం చేయొద్దని గ్రామంలోని పలువురు యువకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఊరెళ్ల ఉప సర్పంచ్ విఠలయ్య, సీనియర్ నాయకులు బాయికాడి యాదయ్య, వెంకటేశ్, బీరప్ప ఇతర గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి గ్రామంలో అంబేడ్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. గ్రామస్తుల అభిప్రాయ సేకరణ చేయకుండా ఊరెళ్లను మున్సిపాలిటీలో వీలినం చేస్తే ఉరుకోమని వారు తేల్చి చెప్పారు.
Updated Date - 2023-07-17T23:14:34+05:30 IST