ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కలుపు మందు అతిగా వాడొద్దు

ABN, First Publish Date - 2023-07-04T23:35:10+05:30

పంటల సాగులో ఎదురయ్యే ప్రధాన సమస్య కలుపు నివారణ. కూలీల చేత కలుపు తీయించినా కొద్దిరోజుల తర్వాత మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. కలుపును సమూలంగా నివారించడానికి అనేక రసాయన మందులు మార్కెట్లో దర్శనిమిస్తున్నాయి.

మొక్కజొన్న పొలంలో పెరిగిన కలుపు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేకపోతే పంట నాశనమయ్యే ప్రమాదం

రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు.

చేవెళ్ల, జూలై 4 : పంటల సాగులో ఎదురయ్యే ప్రధాన సమస్య కలుపు నివారణ. కూలీల చేత కలుపు తీయించినా కొద్దిరోజుల తర్వాత మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. కలుపును సమూలంగా నివారించడానికి అనేక రసాయన మందులు మార్కెట్లో దర్శనిమిస్తున్నాయి. కలపు నివారణకు ఎటువంటి మందు ఎంత మోతాదులో వాడాలి. ఏ కాలంలో ఎంత మందు పిచికారి చేయాలో తెలియక రైతులు నష్టపోతున్నారు. మోతాదుకు మించి వాడడంతో అసలైన పంట మొక్కలపై మందు ప్రభావం చూపడంతో పంటల ఎదుగుదల పూర్తిగా నిలిచిపోయి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అలా కాకుండా కలుపు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చేవెళ్ల మండల వ్యవసాయ విస్తరణ అధికారి రాజేశ్వర్‌రెడ్డి రైతులకు పలు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. ఈ సూచనలు పాటిస్తే దిగుబడికి ఎలాంటి నష్టమూ ఉండదంటున్నారు.

ఇవి పాటిద్దాం..

  • వ్యవసాయాధికారులు సూచనలు, సిఫారసు మేరకు కలుపు నివారణకు ఎంత మోతాదులో, ఎంతమందు వాడాలో తెలుసుకోవాలి.

  • విత్తనాలు విత్తిన 48 గంటల్లోగా (విత్తనాలు మొలకెత్తక ముందే ) నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు పెండి మిథాలిన్‌, అలాక్లోర్‌ మందును పిచికారి చేయాలి.

  • వరి మాగాణిలో వెడల్పు కలిగిన కలుపు మొక్కలను నిర్మూలించడానికి వరి నాటిన 25 నుంచి 30 రోజుల మధ్య పొలంలోని నీటిని తొలగించాలి. తదుపరి 2, 4-డీ సోడియం సాల్ట్‌ పొడి మందును ఎకరానికి 400 నుంచి 500 గ్రా. నీటిలో కలిపి కలుపు మొక్కలపై పడేవిధంగా పిచికారి చేయాలి. ఈ కలుపు మందు పిచికారి చేసే ముందు వ్యవసాయ అధికారుల సలహా, సూచనలు పాటించాలి. లేదంటే కలుపు మందు మోతాదుకు మించితే పంటకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ కలుపు మందును పత్తి, మినుము, పెసర, పొగాకు, పంటలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు.

  • కొన్ని రకాల కలుపు మందులు పంటతో పాటు కలుపు మొక్కలను ఒకేసారి నిర్మూలించే గుణాలు కలిగి ఉంటాయి. ఇటువంటి కలుపుమందు వాడకంపై జాగ్రత్తలు పాటించాలి.

  • పంటలో పెరుగుతున్న కలుపు నివారణ కోసం పిచికారి చేస్తున్న మందు పంటలపై ప్రభావం చూపుతుందో లేదో ముందుగానే తెలుసుకోవడం మంచిది. లేదంటే పంటల ఎదుగుదల పూర్తిగా స్తంభించి నష్టాలను తెచ్చిపెడుతుంది.

  • మొక్కజొన్నలో పెరిగే కలుపు నివారణకు రైతులు ఎక్కువ శాతం అట్రజిన్‌ మందును వాడుతుంటారు. ఈ మందు కలుపు నివారణలో మంచి సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ మందు అవశేషాలు భూమిలో ఎక్కువ కాలం ఇమిడి ఉంటాయి. కాబట్టి వ్యవసాయ అధికారుల సూచనలు పాటించడం మంచిది.

  • అతి మొండిజాతి అయిన గరిక, తుంగ, దర్భ, వంటి కలుపు మొక్కలను గెల్‌పోసెట్‌ మందులు నాలుగు నుంచి ఆరు ఆకులు వచ్చిన దశలో పూతరాక ముందే పిచికారి చేసి సమూలంగా నివారించుకోవాలి. ఈ మందును పిచికారి చేసిన అనంతరం ఎనిమిది గంటల్లోగా ఏదైనా వర్షం పడితే మందు ప్రభావం పూర్తిగా సన్నగిల్లే అవకాశం ఉన్నాయి.

  • నీటిలో కరిగే పొడి రూపంలో ఉన్న కలుపు మందులను ఇసుకలో గానీ, యూరియాలో గానీ కలిపి చల్లకూడదు.

  • కలుపు మందులను పిచికారి చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు హ్యండ్‌ స్పేయర్‌ను మాత్రమే వాడాలి.

వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలి

కలుపు నివారణ కోసం రైతులు మందుల వాడకంపై వ్యవసాయ అధికారుల సూచనలు తీసుకోవాలి. నకిలీ మందులు తీసుకుని మోసపోవద్దు. ఫర్టిలైజర్‌ షాపుల వద్ద బిల్లులు తప్పకుండా తీసుకోవాలి. కలుపు మందు చల్లిన పొలాల గట్ల వెంట పశువులను మేపకుండా జాగ్రత్తలు పాటించాలి.

- రాజేశ్వర్‌రెడ్డి, ఏఈవో, చేవెళ్ల

Updated Date - 2023-07-04T23:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising