ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘న్యూసిటీ వెంచర్‌’లో అక్రమ అనుమతులను రద్దు చేయాలి

ABN, First Publish Date - 2023-02-08T23:51:15+05:30

మండల పరిధి అవుషాపూర్‌లో గల న్యూసిటీ వెంచర్‌లోని పార్కు స్థలంలో అక్రమ అనుమతులు పొందినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని, వాటిని వెంటనే రద్దు చేయాలని సర్పంచ్‌ ఏనుగు కావేరీ మశ్చేందర్‌రెడ్డి బుధవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఫిబ్రవరి 8 : మండల పరిధి అవుషాపూర్‌లో గల న్యూసిటీ వెంచర్‌లోని పార్కు స్థలంలో అక్రమ అనుమతులు పొందినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని, వాటిని వెంటనే రద్దు చేయాలని సర్పంచ్‌ ఏనుగు కావేరీ మశ్చేందర్‌రెడ్డి బుధవారం హెచ్‌ఎండీఏ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అవుషాపూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్లు 255, 261, 262, 263, 264లలో 1986లో న్యూసిటీ పేరుతో వెంచర్‌ చేశారని, అందులో 2,400 గజాల పార్కుస్థలంను ప్రజా అవసరాల కోసం వదిలిపెట్టారని తెలిపారు. అయితే, వెంచర్‌ నిర్మాణదారుడు 2,400 గజాల స్థలంలో హెచ్‌ఎండీఏ నుంచి అనుమతులు పొందినట్లు పత్రాలు సృష్టించి ఇంటి నిర్మాణం కోసం పంచాయతీ అనుమతులు కావాలని అర్జీ పెట్టుకున్నారని తెలిపారు. తప్పుడు పత్రాలు సృష్టించి హెచ్‌ఎండీఏను తప్పుదోవ పట్టిస్తున్న సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, అక్రమ అనుమతులను రద్దు చేయాలని సర్పంచ్‌ కావేరి ఫిర్యాదులో పేర్కొన్నారు.

Updated Date - 2023-02-08T23:51:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising