ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎదగని మొక్కలు

ABN, First Publish Date - 2023-09-11T00:34:07+05:30

వానాకాలంలో పత్తి సాగు రైతులకు కష్టంగా మారింది. ఈ సారి ప్రతీకూల వాతావరణంతో మొక్కల్లో ఎదుగుదల లేదు. సాధారణంగా ఈ సమయానికల్లా మొక్క నాలుగు అడుగులకుపైనే ఎత్తు పెరిగి, మండలు వ్యాపించి మొగ్గ, పూత దశకు రావాలి.

చౌదరిగూడెంలో ఎదుగుదల లేని పత్తి చేను

రైతులకు భారమైన పత్తిసాగు

మొక్కల్లో లోపించిన పెరుగుదల

ప్రతికూల వాతావరణమే కారణం

ఇంకా పూతదశ దాటని పత్తి చేలు

ఈ సారి దిగుబడిపై పడనున్న ప్రభావం

ఎన్నో ఆశలతో తెల్ల బంగారాన్ని సాగు చేసిన రైతులకు చేల ఎదుగుదల లేక దిగులు పట్టుకుంది. ఈ పాటికి నాలుగు ఫీట్ల వరకు ఎత్తు పెరిగి పూత, కాత దశకు రావాల్సిన మొక్కలు ఇంకా రెండు ఫీట్ల ఎత్తే ఉన్నాయి. మొక్కలు ఏపుగా పెరగక దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అతివృష్టి, అనావృష్టితో మొక్కలకు సరైన సమయాల్లో నీరు, ఎరువులు అందకే పత్తి చేలల్లో పెరుగుదల లోపించిందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. చెలక నేలల్లో ఎకరానికి 4 నుంచి 5 క్వింటా, రేగడి నేలల్లో 10-12క్వింటాళ్ల దిగుబడి వస్తేనే రైతులకు గిట్టుబాటు అవుతుంది.

(ఆంధ్రజ్యోతి-రంగారెడ్డి అర్బన్‌, సెప్టెంబరు 10): వానాకాలంలో పత్తి సాగు రైతులకు కష్టంగా మారింది. ఈ సారి ప్రతీకూల వాతావరణంతో మొక్కల్లో ఎదుగుదల లేదు. సాధారణంగా ఈ సమయానికల్లా మొక్క నాలుగు అడుగులకుపైనే ఎత్తు పెరిగి, మండలు వ్యాపించి మొగ్గ, పూత దశకు రావాలి. అయితే ఈ సారి చాలా ప్రాంతాల్లో మొక్కలు రెండు అడుగుల ఎత్తే పెరిగాయి. పూత, కాత కూడా సరిగా లేదు. ఈ పరిస్థితుల్లో పత్తి దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. జూన్‌లో వర్షాలు ఆలస్యంగా కురిశాయి. మేఘాలను చూసి వర్షాలు వస్తాయని రైతులు విత్తనాలు వేయగా వర్షాల్లేక విత్తులు దుక్కిలో మాడిపోయాయి. ఇలా విత్తులు మొలకెత్తకపోవడంతో జూలై రెండో వారం వరకు కొందరు రైతులు రెండు, మూడుసార్లు విత్తనాలు నాటారు. కాగా జూలై మూడో వారంలో భారీ వర్షాలు కురిసి చెలకల్లో నీరు నిలిచి మొలకలు కుళ్లిపోయాయి. నీటి ప్రవాహానికి విత్తులు కొట్టుకుపోయాయి. ఆగస్టు మొదటి వారంలోనూ వర్షాలు దంచి కొట్టాయి. పొలాల్లో నీరు నిలిచి చేను నీరు పట్టింది. అదీగాక ఎరువులు వేయాల్సిన సమయంలో వర్షాల్లేక, కొన్నిసార్లు భారీ వర్షాలతో రైతులు మొక్కలకు మొక్కలకు పోషకాలు అందించలేకపోయారు. దీంతో పత్తి చేలు ఏపుగా పెరగలేదు. ఈ నెలలో వర్షాలు కురిసినా చేలు కోలుకునే పరిస్థితి లేదు. ఎక్కువ రోజులు వర్షాలు లేకే చేను పూత, కాతకు రాలేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం పత్తి పూతదశకు వచ్చింది. అయితే ఈ సారి వాతావరణ ప్రతికూలతలు పత్తి దిగుబడిపై ప్రభావం చూపుతాయని వ్యవసాయాధికారులు అంటున్నారు. వాతావరణం అనుకూలిస్తే చెలక నేలల్లో ఎకరానికి 4-5క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. నల్లరేగడి నేలలో ఎకరానికి 10-12క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ సారి దిగుబడి తగ్గే ఆస్కారం కనిపిస్తోంది. ఏటా అతివృష్టి, అనావృష్టితో పత్తి రైతులు నష్టపోతున్నారు. పత్తి పంట ఎదుగుదలపై రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వడంలో వ్యవసాయాధికారులు విఫలమవుతున్నట్లు తెలుస్తోంది.

పత్తి మొక్కలు అనుకున్నంత పెరగలేదు : గొల్ల వెంకటేశ్‌, రైతు, లచ్చంపేట, చౌదరిగూడెం మండలం

ఈ సారి పత్తి పంట ఎదుగుదల తగ్గింది. మొక్కలు రెండున్నర ఫీట్ల వరకే పెరిగాయి. గతేడాది నేను 20ఎకరాలకు పైగానే పత్తి వేశాను. పెట్టుబడి భరించలేక ఈ సారి విస్తీర్ణం తగ్గించాను. 10ఎకరాల సొంతం, 5ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాను. ఇప్పటికే ఎకరానికి రూ.30వేలకు పైనే ఖర్చయింది. వర్షాలు సరిగా కురియక మొక్కలు ఎత్తు పెరగలేదు. ఇటీవలి వర్షాలకు చెలకల్లో నీరు నిలిచి ఉన్న మొక్కలు కూడా కుళ్లుతున్నాయి. నాకు పెట్టుబడైనా వచ్చే పరిస్థితి కన్పించడం లేదు.

Updated Date - 2023-09-11T00:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising