ఈఎంఆర్‌ఐ గ్రీన్‌హెల్త్ సర్వీసుల తనిఖీ
ABN, First Publish Date - 2023-02-02T00:07:00+05:30
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఈఎంఆర్‌ఐజీహెచ్‌ఎ్‌స(ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ గ్రీన్ హెల్త్ సర్వీసు) సేవలు ప్రశంసనీయమని ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ షాహీద్‌అన్నారు.
మేడ్చల్‌టౌన్, ఫిబ్రవరి 1: ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఈఎంఆర్‌ఐజీహెచ్‌ఎ్‌స(ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ గ్రీన్ హెల్త్ సర్వీసు) సేవలు ప్రశంసనీయమని ఉమ్మడి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ షాహీద్‌అన్నారు. బుధవారం మేడ్చల్ ఈఎంఆర్‌ఐజీహెచ్‌ఎ్‌సలో 108,102,1962 వాహనాలను ఆయన తనిఖీ చేశారు. అంబులెన్స్‌ల పనితీరును తెలుసుకున్నారు. సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటున్న విధానం, అత్యవసర సేవల వినియోగం, తదితర విషయాలను అడిగి తెలసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-02T00:07:01+05:30 IST