త్వరలో జేపీ దర్గా మాస్టర్ ప్లాన్
ABN, First Publish Date - 2023-01-15T00:09:07+05:30
జేపీ దర్గాలో త్వరలో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసిఉల్లాఖాన్ చెప్పారు.
రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ మసిఉల్లాఖాన్
ఎమ్మెల్యేతో కలిసి దర్గాలో పర్యటన
కొత్తూర్, జనవరి 14: జేపీ దర్గాలో త్వరలో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ మసిఉల్లాఖాన్ చెప్పారు. ఇన్ముల్‌నర్వ గ్రామశివారులో గల హజ్రత్ జహంగీర్‌పీర్ దర్గాను శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌తో కలిసి పరిశీలించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముజావర్లు వారికి తలపాగాలు చుట్టి స్వాగతం పలికారు. ప్రత్యేక ప్రార్థనలు ఆనంతరం ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మసిఉల్లాఖాన్ మాట్లాడుతూ ఈ నెల 19 నుంచి 21వరకు మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం 7.50లక్షల నిధులను మంజూరు చేశామన్నారు. దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జేపీ దర్గా ఎంతో ఇష్టాదైవమన్నారు. మాస్టర్‌ప్లాన్ పనులు కొంత ఆలస్యమైన విషయం వాస్తవమేనని, భూసేకరణకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. జేపీ ద ర్గా మాస్టర్‌ప్లాన్ తుదిరేఖలు దిద్దుకుంటుందని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మాట్లాడుతూ దర్గా పరిసరాల్లో జీవిస్తున్న వందలాది మంది వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నామన్నారు. వ్యాపారస్తులకు ఎలాంటి నష్టమూ జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మాస్టర్ ప్లాన్‌కు ప్రతి ఒక్కరు సహకారించాలని ఎమ్మెల్యే కోరారు. జేపీ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, కొత్తూర్ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ అజయ్‌మిట్టునాయక్, టీఆర్‌ఎస్ నాయకులు అగ్గనూరు విశ్వం, దేవేందర్‌యాదవ్, కోస్గి శ్రీనివాస్, తస్లీం, గోపాల్‌నాయక్, ఇంద్రాసేనారెడ్డి, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఓఎ్‌సడీ అసుదుల్లాఖాన్, సూపరింటెండెంట్ సలీం, మాస్టర్‌ప్లాన్ ఇంజనీర్ ఇంతియాజ్ సయ్యద్, స్థానిక సూపరింటెండెంట్ ఎండీ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-15T00:09:18+05:30 IST