జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేయాలి
ABN, First Publish Date - 2023-05-04T23:36:13+05:30
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చేవెళ్లలో పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఎ్‌సఎ్‌సవో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ మద్దతు తెలిపారు.
చేవెళ్ల/కడ్తాల/ఇబ్రహీంపట్నం, మే 4 : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. చేవెళ్లలో పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీఎ్‌సఎ్‌సవో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ మద్దతు తెలిపారు. చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం, పీసీసీ ఉపాధ్యక్షులు జనార్దన్‌రెడ్డి, చేవెళ్ల సమన్వయ కమిటీ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణరెడ్డిలు పాల్గొని మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యదర్శులు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చేవెళ్ల పీఏసీఎస్ చైర్మన్లు వెంకట్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, సర్పంచ్ శైలజ, పీసీసీ సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్, మండలాధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, నాయకులు, తదితరులు ఉన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చేలా కృషి చేయాలని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను కోరారు. కడ్తాల మండల పరిషత్ కార్యాలయం ఎదుట కడ్తాల, ఆమనగల్లు, కందుకూరు, తలకొండపల్లి, మహేశ్వరం మండలాల జూనియర్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. జేపీఎ్‌సల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. జడ్పీటీసీ దశరథ్‌నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివా్‌సరెడ్డి, జహంగీర్‌బాబా, యాట నర్సింహా, బిచ్యానాయక్, జేపీఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్, తదితరులున్నారు. సమ్మె శిబిరాన్ని ఎన్‌బీసీ మాజీ సభ్యుడు ఆచారి, మాజీ జడ్పీటీసీ కండె హరిప్రసాద్, బీజేపీ నాయకులు మోహన్‌రెడ్డి, రాంరెడి ్డలు సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయం ఎదుట జేపీఎ్‌సలు ముగ్గులువేసి నిరసన తెలిపారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల మండలాల జేపీఎ్‌సలు పాల్గొన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గాలయ్య తదితరులు సంఘీభావం తెలిపారు. జేపీఎ్‌సల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
యువత క్రీడల్లోనూ రాణించాలి
చేవెళ్ల, మే 4 : యువత క్రీడల్లోనూ రాణించాలని సినీనటుడు కొమరయ్య అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలోని కేవీఆర్ గార్డెన్‌లో కనకమామిడి వెంకట్‌రెడ్డి-మాడి రంగారెడ్డిల జ్ఞాపకార్థం నెల రోజుల పాటు జరిగిన క్రికెట్ టోర్నమెంట్ గురువారం చేవెళ్ల స్ర్టైకర్స్ - మొయినాబాద్ స్టార్స్ ఫైౖనల్ మ్యాచ్‌తో ముగిసింది. మొదటి బహుమతిగా మొయినాబాద్ స్టార్స్‌కు రూ.లక్ష, షీల్డ్, రెండో బహుమతిగా నిలిచిన చేవెళ్ల స్ర్టైకర్స్ జట్టు రూ. 50వేలతోపాటు షీల్డ్‌ను నటుడు కొమరయ్య అందజేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని కొమరయ్య సూచించారు. గ్రామస్తులు తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-04T23:36:13+05:30 IST