చంద్రబాబుకు నాయకుల శుభాకాంక్షలు
ABN, First Publish Date - 2023-03-23T00:08:56+05:30
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు శ్రీ శోభకృత్ నామ ఉగాదిని పురష్కరించుకుని బుధవారం శుభాకాంక్షలు తెలిపారు.
షాద్‌నగర్ అర్బన్/మొయినాబాద్ రూరల్, మార్చి 22 : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు శ్రీ శోభకృత్ నామ ఉగాదిని పురష్కరించుకుని బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు చెప్పినట్టు బక్కని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అదేవిధంగా తెలుగు సంవత్సరాదిలో ప్రజలందరూ ఆనందంగా జీవించాలని, పనులన్నీ సక్రమంగా ముందుకు సాగాలని చంద్రబాబు భగవంతుడిని కోరుకున్నట్లు టీడీపీ సీనియర్ నాయకుడు, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ కార్యదర్శి కొమ్మిడి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు బాబును వెంకట్‌రెడ్డి నగరంలోని ఆయన నివాసంలో కలిశారు. చేవెళ్ల ప్రాంతంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి క్షేత్రస్థాయిలో పనిచేయాలని చంద్రబాబు సూచించినట్లు వెంకట్‌రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చేవిధంగా కష్టపడాలని, బీఆర్‌ఎస్ అరాచకాలను ప్రజలకు వివరించాలని సూచించినట్లు చెప్పారు. అంతకుముందు టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులుతో కొమ్మిడి వెంకట్‌రెడ్డి సమావేశమయ్యారు.
రేవంత్‌రెడ్డిని కలిసిన వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్ అర్బన్ మార్చి 22: పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ బుధవారం గాంధీభవన్‌లో కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శంకర్, తిరుపతిరెడ్డిలు రేవంత్‌ను శాలువతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
బండి సంజయ్‌ని కలిసి బీజేపీ నేతలు
కందుకూరు : ఉగాదిని పురస్కరించుకొని బీజేపీ జిల్లా నేత ఎగ్గిడి సత్తయ్యతో పాటు పలువురు నేతలు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు బుధవారం ఉదయం నగరంలోని బండి నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బి.మల్లేష్, రవీందర్‌గౌడ్, బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు
Updated Date - 2023-03-23T00:08:56+05:30 IST