భారతీయ జనతా పార్టీలో పలువురి చేరిక
ABN, First Publish Date - 2023-01-22T23:36:08+05:30
మండల పరిధిలోని నిజాంపేట్ మేడిపల్లి గ్రామంలో బీజేపీ నాయకుడు వెంకటేశ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లేశ్ పటేల్, నాయకులు మిట్టా పరమేశ్వర్‌రెడ్డి సమక్షంలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు బీజేపీలో చేరారు.
పూడూరు, జనవరి 22 : మండల పరిధిలోని నిజాంపేట్ మేడిపల్లి గ్రామంలో బీజేపీ నాయకుడు వెంకటేశ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి, ఉపాధ్యక్షుడు మల్లేశ్ పటేల్, నాయకులు మిట్టా పరమేశ్వర్‌రెడ్డి సమక్షంలో ఆదివారం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు బీజేపీలో చేరారు. ఈమేరకు వారికి నాయకులు పార్టీ కండువాలతో ఆహ్వానించారు. మండలంలో బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ పరిగి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ నర్సిములు, జిల్లా కార్యదర్శి హరికృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటన్న, పెంటన్నగుప్త, రవీందర్, బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ రాజు, కోడూరు మండల నాయకులు సుభాన్, సత్యనారాయణ, కాశయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-22T23:36:09+05:30 IST