ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆమనగల్లులో మంత్రి కేటీఆర్‌ పర్యటన

ABN, First Publish Date - 2023-03-29T23:38:04+05:30

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఏప్రిల్‌ 3న ఆమనగల్లు మున్సిపాలిటీలో పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ తెలిపారు.

మంత్రి కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఏప్రిల్‌ 3న బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం

మార్కెట్‌ యార్డ్‌లో 10 వేల మందితో బహిరంగ సభ

ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌

ఆమనగల్లు, మార్చి29 : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఏప్రిల్‌ 3న ఆమనగల్లు మున్సిపాలిటీలో పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌ యాదవ్‌ తెలిపారు. టీయూఎ్‌ఫఐడీసీ నిధుల ద్వారా రూ.15 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారని ఆయన పేర్కొన్నారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఆవరణలో పది వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆమనగల్లు మార్కెట్‌ యార్డ్‌ కార్యాలయంలో బుధవారం మంత్రి కేటీఆర్‌ పర్యటన ఏర్పాట్లు, సభ విజయవంతంపై బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. సభావేదిక స్థలాన్ని మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివాస్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ జక్కు అనంత రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్‌రావు, జిల్లా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యుడు నేనావత్‌ పత్యనాయక్‌లతో కలిసి జైపాల్‌ యాదవ్‌ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేటీఆర్‌ పర్యటన నేపథ్యంలో ఆమనగల్లులో నాలుగు చోట్ల శంకుస్థాపన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. బహిరంగ సభతోపాటు బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివా్‌సగౌడ్‌, నిరంజన్‌రెడ్డి పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్‌ఎ్‌స్‌ నాయకులు దోనాదుల కుమార్‌, రాధమ్మవెంకటయ్య, అప్పం శ్రీను, ఉప్పల రాములు, రమేశ్‌ నాయక్‌, చుక్క వెంకటయ్య, తల్లోజు రామకృష్ణ, రూపం వెంకట్‌రెడ్డి, విజయ్‌రాథోడ్‌, జయరామ్‌, వెంకటయ్య, విక్రమ్‌, రమేశ్‌, రామలింగం, శివ, ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-29T23:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising