ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుళ్లు, చర్చిలు, మసీదుల్లో ఎమ్మెల్యే పూజలు

ABN, First Publish Date - 2023-06-25T23:50:12+05:30

కర్ణాటకలో శనివారం కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వివిధ గ్రామాల్లో, తాండూరు పట్టణంలో ఉన్న పలు దేవాలయాలు, చర్చీలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తాండూరులోని భద్రేశ్వర శివాలయంలో పూజలు చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 1101 కొబ్బరి కాయలు కొట్టిన కార్యకర్తలు

తాండూరు, జూన్‌ 25: కర్ణాటకలో శనివారం కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వివిధ గ్రామాల్లో, తాండూరు పట్టణంలో ఉన్న పలు దేవాలయాలు, చర్చీలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భద్రేశ్వరస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు పాత తాండూరులోని నిజాంషాహి దర్గాలో, తాండూరు మెథడిస్ట్‌ చర్చిలో కార్యకర్తలతో కలిసి ప్రార్థనలు చేశారు. కాగా, పట్టణంలోని తన నివాసం వద్ద కార్యకర్తలు 1101 కొబ్బరి కాయలు కొట్టారు. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సాగర్‌గౌడ్‌ గుమ్మడి కాయతో దిష్టి తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ రాజుగౌడ్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ విశ్వనాథ్‌గౌడ్‌, పట్టణ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు అఫ్ఫు, విఠల్‌రెడ్డి, పట్లోళ్ల నర్సింహులు, శ్రీనివాసాచారి, సుధాకర్‌ ఉన్నారు.

తాండూరు రూరల్‌: కారు ప్రమాదం నుంచి ఎమ్మెల్యే సురక్షితంగా బయట పడినందుకు బీఆర్‌ఎస్‌ నాయకులు ఆదివారం అల్లాపురం రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో తాండూరు మండల బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు రాందాస్‌, బీసీ సెల్‌ మండల నాయకులు చంద్రశేఖర్‌గౌడ్‌, సర్పంచ్‌లు రాజప్పగౌడ్‌, రాములు, ఉపసర్పంచ్‌ చెన్నప్ప, బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రతా్‌పరెడ్డి, గోపాల్‌రెడ్డి, చెనిగే్‌షపూర్‌ ఆలయకమిటీ చైర్మన్‌ ప్రశాంత్‌గౌడ్‌ పాల్గొన్నారు.

యాలాల: ప్రమాదం నుంచి ఎమ్మెల్యే క్షేమంగా బయటపడినందుకు యాలాల మండల నాయకులు పూజలు నిర్వహించారు. యాలాల మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జుంటుపల్లి సీతారామస్వామి ఆలయంలో అభిషేకం, అర్చన చేయించారు. అనంతరం 101కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఆప్షన్ల సంఘం సభ్యుడు అక్బర్‌బాబా, సొసైటీ వైస్‌చైర్మన్‌ వడ్డె రాములు, యూత్‌ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌, యువ నాయకులు లాలు, శేఖర్‌రెడ్డి, రఘురెడ్డి, కృష్ణ, సర్పంచ్‌ లక్ష్మప్ప, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

అనంతపద్మనాభ స్వామి ఆలయంలో..

వికారాబాద్‌: అనంతగిరి అనంతపద్మనాభ స్వామిని తాండూరు ఎమ్మెల్యే పైలేట్‌ రోహిత్‌ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఎండోమెంట్‌ అధికారులు ఆయనను సన్మానించారు.

Updated Date - 2023-06-25T23:50:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising