ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మరోసారి బీఆర్‌ఎ్‌సదే అధికారం

ABN, First Publish Date - 2023-11-29T00:11:02+05:30

తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రానుందని ఇబ్రహీంపట్నంలో కూడా భారీ మెజార్టీతో తనను ఆశీర్వదించాలని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరారు.

ఇబ్రహీంపట్నం : శేరిగూడలో మాట్లాడుతున్న మంచిరెడ్డి

ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

ఇబ్రహీంపట్నం/అబ్దుల్లాపూర్‌మెట్‌/హయత్‌నగర్‌, నవంబరు 28: తెలంగాణలో మరోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రానుందని ఇబ్రహీంపట్నంలో కూడా భారీ మెజార్టీతో తనను ఆశీర్వదించాలని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి కోరారు. మంగళవారం శేరిగూడ, ఎంపీ పటేల్‌గూడలలో రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గాన్ని మరింత వృద్ధిలోకి తేవడంతో పాటు కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయించి యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. ఇబ్రహీంపట్నం చెరువు ప్రధాన కాలువలకు రూ.15 కోట్లతో మరమ్మతులు చేయడంతోనే చెరువు నీటితో కళకళలాడుతుందన్నారు. అంతేకాకుండా దీనిని రూ.18 కోట్లతో పర్యాటకంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. శంషాబాద్‌ నుంచి బొంగులూరు మీదుగా పెద్దఅంబర్‌పేట్‌ వరకు మెట్రోలైన్‌ను తీసుకువస్తామన్నారు. రూ.425 కోట్లతో బొంగులూరు నుంచి మాల్‌ వరకు నాలుగు లేన్లుగా రహదారిని విస్తరించే పనులు త్వరలోనే చేపడతామన్నారు. ఎన్నికలప్పుడే వచ్చే వారిని నమ్మొద్దన్నారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ పనులు వేగవంతంగా నడుస్తున్నాయని, పెద్దఎత్తున యువతకు, మహిళలకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. క్యామ మల్లేష్‌, మొద్దు అంజిరెడ్డి, అల్వాల వెంకట్‌రెడ్డి, కాయితి మోహన్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆకుల యాదగిరి, కౌన్సిరల్‌ విశాల తదితరులున్నారు. అదేవిధంగా యాచారం మండల కేంద్రంలో జరిగిన రోడ్‌ షోలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫార్మాసిటీతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి ఆదుకుంటానన్నారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీరందించి ఆదుకుంటామన్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీటీసీ జంగమ్మ, పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు రమేష్‌ గౌడ్‌, పి.బాషాలు పాల్గొన్నారు. ప్రచారంలో చివరి రోజు పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి మద్దతుగా దండెం రాంరెడ్డి ఆధ్వర్యంలో పెద్దఅంబర్‌పేట్‌లో వందల భైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని పలు వార్డులు, కాలనీల్లో కొనసాగిన ర్యాలీలో కారు గుర్తుకు ఓటువేసి మంచిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. అలాగే ఫాక్స్‌కాన్‌ కంపెనీలో ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ అవకాశం కల్పించే బాధ్యత తనదని మంచిరెడ్డి హామీ ఇచ్చారు. తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ కమ్మగూడ, ఇంది రమ్మ కాలనీ, రాజ్‌రంజిత్‌ కాలనీ, లక్ష్మినగర్‌లో రోడ్‌ నిర్వహించారు. ఎంకేఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా సుమారు 6వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ శిక్షణ ఇప్పించానన్నారు.

Updated Date - 2023-11-29T00:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising