షాద్‌నగర్‌లో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభం
ABN, First Publish Date - 2023-11-24T00:40:55+05:30
షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు గురువారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖ సినీనటి అనుసూయాభరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేశారు.
సందడి చేసిన సినీ నటి అనుసూయ భరద్వాజ్
యాజమాన్యాన్ని అభినందించిన బక్కని
షాద్‌నగర్‌అర్బన్, నవంబరు 23: షాద్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు గురువారం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన ప్రముఖ సినీనటి అనుసూయాభరద్వాజ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా షాపింగ్‌మాల్లో ఆమె కలియ తిరిగారు. స్టేజీపైౖ కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన వేలాది మందిని అనుసూయ తన హావభావాలతో అలరించారు. అనంతరం విలేఖరులతో ఆమె మాట్లాడుతూ.. వస్త్ర ప్రపంచంలో రాణిస్తోన్న సీఎంఆర్ యాజమాన్యం 27 షాపులను ప్రారంభించిందని అన్నారు. తెలంగాణలో కూడా ఏడు షాపులను నెలకొల్పి, సరసమైన ధరలకు వస్త్రాలను విక్రయిస్తోందని అన్నారు. తన వస్త్రవ్యాపారాన్ని షాద్‌నగర్ ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చిన సీఎంఆర్ యాజమాన్యాన్ని బక్కని నర్సింహులు అభినందించారు. సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ బాలాజీ, భవన యజమాని పలబట్ల బాల్‌రాజ్, సినీ నిర్మాత వి. దుర్గారావు, పట్టణ ప్రముఖులు పాతూరి వెంకటరావు, పి.వెంకటసాయిశ్వర్‌రెడ్డి, లింగారం కుమార్‌గౌడ్, ఆన్మారి వెంకటయ్య, మలిపెద్ది శ్రీనివాస్, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, ఆర్. కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-11-24T00:40:56+05:30 IST