ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేసవి దుక్కులతో లాభాలు మెండు

ABN, First Publish Date - 2023-05-04T23:40:38+05:30

వ్యవసాయం నిత్య కృత్యం. రైతులకు పనిలేని రోజు అంటూ ఉండదు. చేయాలనుకుంటే ఏ కాలంలోనైనా పనులకు కొదవు ఉండదు. వానాకాలం, శీతాకాలం, ఎండా కాలం ఇలా అన్ని కాలాల్లో రైతులు పొలాల్లో బిజీగా గడుపుతుంటారు.

దుక్కి దున్ని సిద్ధం చేసిన పొలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లోతు దుక్కులతో చీడపీడల నివారణ

వర్షం నీరు లోతుకు చేరే అవకాశం

గొర్రెల మందలు ఉంచడంతో సేంద్రియ ఎరువుల లభ్యం

సేంద్రియంతో పంట దిగుబడి అధికం

వేసవిలో దుక్కులు దున్నడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పంటల ఉత్పత్తి పెరగడంతోపాటు చీడ,పీడల బెడద ఉండదు. అంతేకాకుండా లోతు దుక్కుల వల్ల వర్షపు నీరు లోతుగా వెళ్లి పంటలకు ఉపయోగకరంగా ఉంటుంది.

చేవెళ్ల, ఏప్రిల్‌ 16 : వ్యవసాయం నిత్య కృత్యం. రైతులకు పనిలేని రోజు అంటూ ఉండదు. చేయాలనుకుంటే ఏ కాలంలోనైనా పనులకు కొదవు ఉండదు. వానాకాలం, శీతాకాలం, ఎండా కాలం ఇలా అన్ని కాలాల్లో రైతులు పొలాల్లో బిజీగా గడుపుతుంటారు. వేసవిలో ఎండలకు భయపడి వ్యవసాయ పనులకు కొంత విరామం ఇస్తారు. కానీ ఆ కాలంలోనూ రైతులు చేసుకోవడానికి పొలం పనులు చాలానే ఉంటాయి. వచ్చే వర్షాకాలం నాటికి పంటలు వేయడానికి ఇప్పటి నుంచే దుక్కులు రెడీ చేసుకునే పనుల్లో నిమగ్నమై పోతారు. ఎండాకాలం పొలంలో చేసే పనుల బట్టే పంట దిగుబడి ఉంటుంది.

లోతు దుక్కులతో ప్రయోజనాలు

ఇటీవల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. ప్రస్తుతం సరిపడా తేమ పొలాల్లో ఉండటంతో దుక్కులు దున్నుకోవడానికి సరైన సమయం ఇది. దుక్కులను దున్నడంలోనూ రైతులు సరైన మెళకువలు పాటించాలని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దుక్కులు సుమారు 9 అంగుళాల లోతు దున్నేలా చూసుకోవాలి. వేసవిలో లోతు దుక్కుల వల్ల నేలపై పొరల్లో ఉండే పురుగులను, తెగుళ్లు నశించే అవకాశం ఉంటుంది. నేలను లోతుగా దున్నినప్పుడు నేలలో దాక్కునే, నిద్రావస్థలో ఉండే పురుగులు, తెగుళ్లను కలగజేసే శిలీంద్రాలు ఎండల బారిన పడి నశిస్తాయి. అందువల్ల వేసవి కాలంలో పంట కోతలు పూర్తయిన వెంటనే పొలాలను దున్ని ఉంచితే తొలకరిలో నాటే పంటకు ఉపయోగకరంగా ఉంటుంది. గొర్రు, గుంటక, దతెల వంటి పరికరాలు నేల లోపలకి 3-5 అంగుళాల లోతు వరకు మాత్రమే చొచ్చుకుపోతాయి. ఇలా చేయడం వల్ల భూమి లోపల ఒకగట్టి పొర ఏర్పడుతోంది. దీనివల్ల నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతోంది. కావున నేలను లోతుగా దున్నడం వల్ల ఈ గట్టి పొరచేధింపబడి నేలకు నీటినిపీల్చుకునే శక్తి అధికమవుతోంది. పంటల కోతల తర్వాత మిగిలిపోయిన మొదళ్లు, కలుపు మొక్కలు, రాలిపడిన ఆకుల వంటివి లోతుగా దుక్కి దున్నినప్పుడు నేలలో కలిసి కుళ్లిపోతాయి. అవి సేంద్రియ పదార్థాలుగా మారి పంటకు పోషక విలువలు అందిస్తాయి.

పశువుల ఎరువులను పొలాలకు వేయాలి

సంవత్సరం పొడవునా నిలువ చేసిన పశువుల ఎరువులను ఎండాకాలంలోనే పొలాల్లో పోయాలి. వర్షాలు పడిన తర్వాత ఆ ఎరువులను నేలపై చల్లితే మట్టిలో బాగా కలిసిపోతాయి. దీనివల్ల పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయి.

జీవాల మంద ఉంచడం

గతంలో ఎండాకాలం పొలాల్లో జీవాల మందను ఉంచేవారు. వాటి మలమూత్రాలు పంటల ఎదుగుదలకు ఉపయోగపడుతుందని రైతులు ఇలా చేసేవారు. ప్రస్తుత రోజుల్లో పశుగణాలు తగ్గిపోయాయి కాబట్టి పొలాల్లో మందను కట్టేయడం తగ్గిపోయింది. కొన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. పశువులు, గొర్రెల నుంచి వచ్చే సేంద్రియ ఎరువుల వల్ల పంటల ఎదుగుదలకు ఉపయోగపడి దిగుబడి అధికంగా ఉంటుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

వేసవిలోనే దుక్కులు దున్నుకోవాలి

వేసవిలో దుక్కులను లోతుగా దున్నుకోవడం వల్ల రైతులకు వర్షాకాలంలో మంచి ఫలితాలు వస్తాయి. ఎండాకాలంలో సేంద్రియ ఎరువులను పొలాల్లో జల్లితే పంటల దిగుబడి బాగా వస్తుంది. సాగులో వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

- తులసి, చేవెళ్ల మండల వ్యవసాయ అధికారి

Updated Date - 2023-05-04T23:40:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising