ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వయసు మీరిన వారిని తొలగించాలి

ABN, First Publish Date - 2023-02-13T23:18:11+05:30

వయసు మీరిన అంగన్‌వాడీ టీచర్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలని మహిళా శిశు సంక్షేమశాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ తాండ్ర విశాల శ్రవణ్‌ సూచించారు.

మాట్లాడుతున్న తాండ్ర విశాల శ్రవణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళా శిశు సంక్షేమశాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ తాండ్ర విశాల శ్రవణ్‌

రంగారెడ్డి అర్బన్‌, ఫిబ్రవరి 13 : వయసు మీరిన అంగన్‌వాడీ టీచర్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించుకోవాలని మహిళా శిశు సంక్షేమశాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్‌పర్సన్‌ తాండ్ర విశాల శ్రవణ్‌ సూచించారు. అదేవిధంగా తొలగించిన టీచర్లకు రిటైర్మెంట్‌ బినిఫిట్స్‌ ఇవ్వాలని కోరారు. జిల్లాకు నూతనంగా అంగన్‌వాడీ కేంద్రాలు మంజూరు చేయాలన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు మహిళా శిశుసంక్షేమము(స్థాయిసంఘం-5), మధ్యాహ్నం 12 గంటలకు సాంఘిక సంక్షేమం(స్థాయి సంఘం-6), మధ్యాహ్నం 2 గంటలకు వ్యవసాయం(స్థాయి సంఘం-3) సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి హాజరైన ఆమె మాట్లాడారు.

హాస్టల్‌ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి :

సాంఘిక సంక్షేమ శాఖ స్థాయిసంఘం చైర్‌పర్సన్‌ సేనవత్‌ అనురాధ

హాస్టల్‌ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సాంఘిక సంక్షేమ శాఖ స్థాయిసంఘం చైర్‌పర్సన్‌ సేనవత్‌ అనురాధ సూచించారు. ఆమనగల్లు ఎస్సీ హాస్టల్‌ను తాను తనిఖీ చేసిన సందర్భంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. విద్యార్థులు పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

రైతుబంధు, రైతు బీమా వెంటనే ఇవ్వాలి :

వ్యవసాయ స్థాయి సంఘం చైర్మన్‌ ఈట గణేష్‌

రైతులకు పెండింగ్‌లో ఉన్న రైతుబంధు, రైతుబీమా వెంటనే అందివ్వాలని వ్యవసాయ స్థాయి సంఘం చైర్మన్‌ ఈట గణేష్‌ ఆదేశించారు. ధాన్యం నిలువ చేసేందుకు మంజూరైన గోదాంలను నిర్మించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఈవో దిలీ్‌పకుమార్‌, డిప్యూటీ సీఈవో రంగారావు, జిల్లా శిశుసంక్షేమాధికారి మోతి, కందుకూరు, మంచాల జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-13T23:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising