ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేవెళ్లలో సిద్దార్థ ఆసుపత్రి సీజ్‌

ABN, First Publish Date - 2023-02-24T23:07:22+05:30

ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్‌ ఆసుపత్రిని నిర్వహిస్తుం డటంతోపాటు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సిద్దార్థ ఆసుపత్రి వైద్యులపై జిల్లా వైద్యాధికారులు కొరఢా ఝుళిపించారు.

ఆస్పత్రిని సీజ్‌ చేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనుమతులు లేకుండా స్కానింగ్‌, లింగ నిర్ధారణ పరీక్షలు

వైద్యాధికారుల ఆకస్మిక తనిఖీ

హైమావతి, శ్రీకాంత్‌ శుక్లాలపై క్రిమినల్‌ కేసు నమోదు

చేవెళ్ల, ఫిబ్రవరి 24 : ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రైవేట్‌ ఆసుపత్రిని నిర్వహిస్తుం డటంతోపాటు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సిద్దార్థ ఆసుపత్రి వైద్యులపై జిల్లా వైద్యాధికారులు కొరఢా ఝుళిపించారు. స్కానింగ్‌ మిషన్లతోపాటు ఆసుపత్రిని సీజ్‌ చేశారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి 7 గంటలకు చేవెళ్లలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. చేవెళ్ల పట్టణంలో పర్మిషన్లు లేకుండా డాక్టర్‌ హైమావతి సిద్దార్థ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు, స్కానింగ్‌ చేస్తున్నారని జిల్లా వైద్య శాఖ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటేశ్వరరావు చేవెళ్ల పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి సిద్దార్థ ఆసుత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో గర్భిణికి స్కానింగ్‌ చేస్తూ డాక్టర్‌ హైమావతి, స్కానింగ్‌ వైద్యుడు శ్రీకాంత్‌ శుక్లా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో అక్కడే వేచి ఉన్న మరో 12 మంది గర్భిణులను విచారించారు. పూర్తి నిజ నిర్ధారణ తర్వాత స్కానింగ్‌ మిషన్లతోపాటు ఆసుపత్రిని సీజ్‌ చేశారు. వైద్యులను అరెస్టు చేసి చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆసుపత్రిని నిర్వహిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హైమావతి హోమియోపతి వైద్యురాలు అని, ఆమె గర్భిణులకు వైద్యం చేయడం నేరమన్నారు. కాలం చెల్లిన మిషన్లతో గర్భిణులకు స్కానింగ్‌ చేయడంతోపాటు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆధారాలు లభించాయని తెలిపారు. హైమావతి నిజామాబాద్‌లోని ప్రభుత్వ ఆసుప్రతిలో హోమియోపతి వైద్యురాలుగా కొనసాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయని, దీనిపై విచారణ సాగిస్తామన్నారు. వైద్యం కోసం వచ్చి వచ్చిన గర్భిణుల వద్ద వైద్యురాలు తీసుకున్న డబ్బులను తిరిగి ఇప్పించామన్నారు. ఈ తనిఖీల్లో చేవెళ్ల డీఎంహెచ్‌వో దామోదర్‌, జిల్లా అధికారులు రాకేశ్‌, శ్రీనివాస్‌, సీహెచ్‌వో గోపాల్‌రెడ్డి, ఎస్సై హయ్యూం, రెవెన్యూ అధికారి కృష్ణ, నర్సింహులు ఉన్నారు.

Updated Date - 2023-02-24T23:07:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising