TS News: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి
ABN, First Publish Date - 2023-05-07T09:29:13+05:30
ఇటీవల కాలంలో గుండె పోటు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృత్యువు ఏ విధంగా వస్తుందో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు హుషారుగా ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు.
రంగారెడ్డి: ఇటీవల కాలంలో గుండె పోటు కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మృత్యువు ఏ విధంగా వస్తుందో చెప్పలేని పరిస్థితి. అప్పటి వరకు హుషారుగా ఉన్న వారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా ఇలాంటి విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండటంతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గుండెపోటుతో కన్నుమూశాడు. ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి మణికంఠ అనే సాప్ట్‌వేర్ మహేశ్వరంలోని కేసీఆర్ స్టేడియంలో క్రికెట్ ఆడాడు. అయితే ఒకే ఓవర్ బాలింగ్ చేసిన మణికంఠ విశ్రాంతి తీసుకోవడానికి కారులోకి వెళ్లాడు. అయితే కారులోనే గుండెపోటుతో సాఫ్ట్‌వేర్ తుదిశ్వాస విడిచాడు. కూకట్‌పల్లిలోని ఓ హాస్ట్‌లో ఉంటూ మణికంఠ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తమతో సరదాగా ఆడుతున్న స్నేహితుడు విగతజీవిగా మారడంతో తోటి స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందిన వెంటనే మహేశ్వరం పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మణికంఠ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Updated Date - 2023-05-07T09:29:13+05:30 IST