ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రీతి మృతి కేసు నిందితులను శిక్షించాలి

ABN, First Publish Date - 2023-02-28T00:16:52+05:30

వైద్య విద్యార్థి ప్రీతి మృతి కేసు నిందితులను శిక్షించాలని అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు.

వికారాబాద్‌: కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజన సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వికారాబాద్‌/తాండూరు/తాండూర్‌ రూరల్‌/పరిగి/కులకచర్ల/పూడూరు/కొడంగల్‌/బొంరా్‌సపేట్‌/కొడంగల్‌ రూరల్‌/మేడ్చల్‌ టౌన్‌, ఫిబ్రవరి 27: వైద్య విద్యార్థి ప్రీతి మృతి కేసు నిందితులను శిక్షించాలని అఖిల భారత గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రాఘవన్‌ నాయక్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం వికారాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రాత్రి వికారాబాద్‌ పట్టణంలో గిరిజన సంఘాల నాయకులు, న్యూ డెమోక్రసీ, ఉద్యోగ గిరిజన సంఘాలు నాయకులతో కలిసి పట్టణంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ప్రీతికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ చందర్‌ నాయక్‌, ధారూరు వైస్‌ ఎంపీపీ విజయ్‌కుమార్‌ ఏఐటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్‌నాయక్‌, బాలూనాయక్‌, న్యూడెమోక్రసీ అధ్యక్షురాలు గీత మహేందర్‌, నాయకులు పాండునాయక్‌, బాబునాయక్‌, విజయ్‌, అనిల్‌ కుమార్‌, రాధిక, గంగ్యా, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరులోని ఇందిరా చౌక్‌లో సింగపూర్‌ బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ధారాసింగ్‌, నాయకులు అరుణ్‌కుమార్‌ పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు నియోజకవర్గం యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు బోయ అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రీతి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పరిగిలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఎల్‌హెచ్‌పీఎస్‌, జీవీఎస్‌, ఎన్‌ఎ్‌సఎ్‌సయూఐ, సీపీఎం తదితర సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు, ఎల్‌హెచ్‌పీఎ్‌స జిల్లా అధ్యక్షుడు గోవింద్‌నాయక్‌, జీవీఎస్‌ జిల్లా అధ్యక్షుడు రాథోడ్‌శ్రీనివాస్‌, ఎన్‌ఎ్‌సయూఐ పరిగి మండల అధ్యక్షుడు నాగవర్ధన్‌, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.వెంకటయ్య, రమేశ్‌నాయక్‌, శ్రీకాంత్‌, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కులకచర్ల చౌరస్తాలో యువజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు బీఎస్‌ ఆంజనేయులు, గోపాల్‌నాయక్‌, గిరిజన సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పూడూరులో సేవాలాల్‌ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి జటోవాత్‌ రవినాయక్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రీతి మృతికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా కొడంగల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ప్రీతికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు శంకర్‌నాయక్‌, యు.రమేశ్‌బాబు, శంకర్‌నాయక్‌, యం.కృష్ణంరాజు, నర్సింగ్‌నాయక్‌, అన్నుబాయి, పాండునాయక్‌, భీమారాజ్‌, రాజునాయక్‌, దస్తప్ప, చిన్నయ్య, ఎండీ.షాకీర్‌, దేవేందర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. మృతికి కారణమైన సైఫ్‌కు ఉరిశిక్ష విధించాలని ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు, అధ్యాపకులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా బొంరా్‌సపేట్‌ మండలంలోని బొట్లవనితండా నుంచి తుంకిమెట్ల వరకు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రీతికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నెహ్రునాయక్‌, రాంనాయక్‌, సురేశ్‌, రవి, రంజిత్‌ పాల్గొన్నారు. అదేవిధంగా మేడ్చల్‌లో బీసీ విద్యార్ధి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు అరుణ్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. ప్రీతి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి చర్యలు పునారావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చట్టాలను తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పోచారం మున్సిపాలిటీ, సంస్కృతి టౌన్‌షి్‌పలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీజేపీ మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు పి విక్రంరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రీతి మృతికి కారకుడైన వ్యక్తిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో గిరిజన మోర్చా జాతీయ నాయకుడు నానావత్‌ బిక్కు నాయక్‌, మెట్టు నర్సింహారెడ్డి, సురేష్‌, టౌన్‌షిప్‌ వాసులు పాల్గొన్నారు. మెడికో ప్రీతి మృతితో మేడ్చల్‌లో లంబాడ సంక్షేమ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ధన్‌రాజ్‌నాయక్‌ ఆధ్వర్యంలో క్యాండిల్‌ ర్యాలీతో నివాళులర్పించారు.

Updated Date - 2023-02-28T00:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!