ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలంగాణ ఏర్పడ్డాకే గ్రామాల అభివృద్ధి

ABN, First Publish Date - 2023-08-02T00:26:00+05:30

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మారుమూల గ్రామాలు సైతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు.

శ్రీనివాసులగూడలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే అంజయ్య

నందిగామ, అగస్టు 1: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే మారుమూల గ్రామాలు సైతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మోత్కుళ్లగూడ, ఈదులపల్లి, మొదళ్లగూడ, మామిడిపల్లి, శ్రీనివాసులగూడ, మంచన్‌పహాడ్‌, వీర్లపల్లి, అప్పారెడ్డిగూడ, చంద్రాయన్‌గూడ గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను పరిష్కరించేందుకు పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు, వృద్ధులు పింఛన్లు ఇవ్వడం లేదని, ఇళ్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. కాగా, మెట్రోను షాద్‌నగర్‌ వరకు పొడగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నందిగామ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ చిత్రపటాలకు ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. జడ్పీ వైస్‌చైర్మన్‌ ఈట గణేష్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల్ల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు లతాశ్రీశైలం, పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌, సర్పంచులు చంద్రారెడ్డి, కుమార్‌, వీరేందర్‌, గోవిందు అశోక్‌, వానరాశి ఎల్లమ్మ, జేకే నర్సింలు, కవిత శ్రీనివాస్‌ నాయకులు విఠల్‌, శ్రవణ్‌ పట్వారి, రమేష్‌, శ్రీశైలం, బేగ్‌ నర్సింహ, రాంబాబు, రాజశేఖర్‌, చందు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-02T00:26:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising