ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమల హబ్‌గా తుక్కుగూడ మున్సిపాలిటీ

ABN, First Publish Date - 2023-06-11T23:24:27+05:30

మహేశ్వరం నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రగతి బాటలో పయనిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతం పరిశ్రమల హబ్‌గా తయారవుతుందని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి తెలిపారు.

తుక్కుగూడలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, జూన్‌ 11 : మహేశ్వరం నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రగతి బాటలో పయనిస్తూ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ల ప్రత్యేక చొరవతో ఈ ప్రాంతం పరిశ్రమల హబ్‌గా తయారవుతుందని విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం తుక్కుగూడ మున్సిపాలిటీలోని 13, 14, 15వ వార్డుల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నాళాలు, తాగునీరు సమస్యల పరిష్కారం కోసం రూ.320కోట్లు కేటాయించినట్లు చెప్పారు. నాలుగు చోట్ల సమీకృత మార్కెట్లు, వైకుంఠధామాలు నిర్మిస్తున్నామని, సుమారు రూ.40 కోట్లతో పది చెరువుల సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు వివరించారు. తుక్కుగూడ మున్సిపల్‌ కేంద్రంలోని పురాతన బురుజు ఆధునికీకరణకు రూ.25లక్షలు మంజూరయ్యాయన్నారు. అదేవిధంగా మెట్రో రైలును తుక్కుగూడ వరకు పొడిగించాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు సప్పిటి లావణ్యరాజు, రవినాయక్‌, సుమన్‌, తేజశ్విని శ్రీకాంత్‌, బీఆర్‌ఎస్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య, కమిషనర్‌ వెంకట్‌రామ్‌ పాల్గొన్నారు.

అభివృద్ధికి ఆకర్శితులై..

అభివృద్ధికి ఆకర్శితులై ఇతర పార్టీల నుంచి బీఆర్‌ఎ్‌సలోకి వలసలు వస్తున్నారని అందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఏకతాటిపైకి రావాలని మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఆదివారం మహేశ్వరం మండలం పడమటి తండాకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు మంత్రి క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆంగోత్‌ రాజునాయక్‌, సర్పంచ్‌ లావణ్యలింగం, మాజీ సర్పంచ్‌ రాములునాయక్‌, నాయకులు హెచ్‌.చంద్రయ్య, లింగం పాల్గొన్నారు.

Updated Date - 2023-06-11T23:24:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising