ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవ ఉషస్సుల ఉగాది

ABN, First Publish Date - 2023-03-22T00:15:27+05:30

మామిడాకుల తోరణాలు.. మంగళనాదాలు, కోకిలమ్మ రాగాలు, వసంతుని వలపు గీతాలు, వేపపూల వగరు భాష్యాలను తెలిపే ఉగాది పండగ వచ్చేసింది.

ఆమనగల్లులో ఉగాది పచ్చడి తయారు చేస్తున్న యువతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీశోభకృత నామ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సిద్ధమైన జిల్లా ప్రజలు

ఉగాది పచ్చడికి అవాంతరాలు

రాలిన మామిడి పూత, కాయని కాత

ఎర్రబారిన వేప, కనిపించని పూత

మామిడాకుల తోరణాలు.. మంగళనాదాలు, కోకిలమ్మ రాగాలు, వసంతుని వలపు గీతాలు, వేపపూల వగరు భాష్యాలను తెలిపే ఉగాది పండగ వచ్చేసింది. కొత్త తెలుగు సంవత్సరాదికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఉమ్మడి జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. షడ్రుచులతో చేసే ఉగాది పచ్చడి ఈ పండగకు ప్రత్యేకంగా నిలవనుంది. తీయని భక్ష్యాలు ఈ వేడుకకు మరింత ఆనందాన్ని జోడించనున్నాయి.

- రంగారెడ్డి అర్బన్‌ / ఆమనగల్లు, మార్చి 21

ఉగాది పచ్చడి విశిష్టత

ఉగాది విశిష్టత పచ్చడి. జీవితంలో మంచి చెడులు, కష్టసుఖాలు అంతర్భాగమని వాటిని ధైర్యంగా స్వీకరించడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఈ పచ్చడి అంతరార్థం. కొత్త సంవత్సరానికి గుర్తుగా కొత్త బెల్లం, చింతపండు, మామిడికాయ, వేపపువ్వుు, మిరియాలు, ఉప్పు కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడికి విశిష్టత ఉంది. తీపి, చేదు, కారం, ఉప్పు, పులుపు వగరు రుచులు విచారం, సంతోషం, కోపం, భయం, అయిష్టత, ఆశ్చర్యానికి గుర్తుగా సూచిస్తాయి.

పంచాంగ శ్రవణం.. ప్రాధాన్యత

ఉగాది పండగ అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి, పంచాగ శ్రవణం. ఈ ఏడాది 22 బుధవారం నాడు శ్రీశోభకృత నామ సంవత్సర ఉగాది పండగను జరుపుకోనున్నారు. అందుకే ఉగాది పండగైన తొలిరోజున ఆలయాల్లో లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతాల్లో పండితులు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ సమయంలో వచ్చే ఏడాది వరకు తమ రాశి ఫలాలు, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో తెలుసు కుంటారు. కొత్త సంవత్సరంలో పాడి పంటలు, వాతావరణ అనుకూలతలు, ఆదాయ, వ్యయాలు, గ్రహనుగ్రహఫలాలు తెలుసుకుంటారు.

పచ్చడికి దొరకని వేపపువ్వు

ఉగాది నాటికి ఆకురాలి కొత్త చిగుళ్లు వేయడంతో పాటు పూత పూయాల్సిన వేప చెట్లు ఎండి పోయి కనిపిస్తున్నాయి. కొన్ని చెట్లు కొత్తగా చిగురించినప్పటికీ పూత మాత్రం పూయలేదు. ఒకప్పుడు ఉగాది వచ్చిందంటే ఇంటి ఆవరణంలోనే, ఇంటి పక్కనే దొరికే వేపపువ్వును నేడు వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండేళ్లుగా వేపచెట్లు ఎండి పోతున్నాయి. వేపచెట్లు సగం పచ్చగా.. సగం ఎండి పోయాయి. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న చెట్లు అరుదుగా కనిపిస్తున్నాయి. దీంతో వేపపువ్వు లేకుండానే కొందరు పచ్చడి చేసుకుంటున్నారు.

మామిడి కాయలు కరువు

ఉగాడి పచ్చడిలో ఉపయోగించే మామిడి కాయలు ఈ సారి కరువయ్యాయి. పూత నిలవలేదు. పింద ఎదగ లేదు. కొన్ని ప్రాంతాల్లో కాయలు కాసినా ఇటీవల కురిసన ఈదురు గాలులు, వడగళ్ల బీభత్సవానికి మొత్తం నేలరాలాయి. నేలరాలిన మామిడి పిందెలు, కాయలను మార్కెట్‌లో అమ్ముతున్నారు. భూమిలో తేమశాతం అధికంగా ఉండటంతో మామిడి పూత రాలిందని.. కాత లేకుండా పోయిందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

మట్టి కుండలకు పెరిగిన గిరాకీ

రోజు రోజుకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉపశమనం కోసం ఎక్కువగా జనం దప్పిక తీర్చు కునేందుకు మట్టి కుండల వైపు మొగ్గు చూపు తున్నారు. దీంతో ఉగాది పండగకు మట్టి కుండలకు గిరాకీ పెరింది. పచ్చడి కుండా సైజును బట్టి రూ.120-150 వరకు అమ్ముడు పోతున్నాయి.

తగ్గిన చింతపండు దిగుబడి

గత ఏడాది చింతచెట్లకు చింత కాయలు విపరీతంగా కాశాయి. కానీ.. ఈ సారి కాత చాలా వరకు తగ్గిందని రైతులు చెబుతున్నారు. ఉగాది పచ్చడికి కొత్త చింతపండు కావాల్సి ఉంటుంది. చింతపండు కోసం మార్కెట్‌కు వెళితే.. ప్రస్తుతం కిలో రూ.120 ఉందని, ఈ సారి దిగుబడి తక్కువగా ఉందని, ధర పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.

మంత్రి సబితారెడ్డి శుభాకాంక్షలు

జిల్లా ప్రజలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీశోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు తెలి పారు. ప్రజలు ఏడాదంతా సుఖ సంతోషాలతో జీవించాలని, ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందో త్సాహాలతో జరుపుకోవాలని ఆకాం క్షించారు. సీఎం కేసీఆర్‌ సార థ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. పండగ వేళ ప్రజలకు అన్నీ శుభాలే కలగాలి.

జిల్లా కలెక్టర్‌ హరీష్‌ శుభాకాంక్షలు

ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ హరీష్‌ జిల్లా ప్రజలకు ఉగాది పండగ శుభా కాంక్షలు తెలిపారు. శ్రీశోభకృత్‌ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ ఏడాదంతా ప్రజలందరి జీవితాల్లో ఆనందో త్సవాలు నింపాలని, ఇంటిల్లిపాది ఆనందోత్సవాలతో ఉగాది పండ గను జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

Updated Date - 2023-03-22T00:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising