ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముందస్తుగా యూనిఫాం!

ABN, First Publish Date - 2023-05-29T23:57:39+05:30

వేసవి సెలవుల తర్వాత ఏటా జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. తరగతులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా... విద్యార్థులకు రకరకాల దుస్తుల్లో పాఠశాలకు వచ్చేవారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బడులు తెరిచే నాటికి పంపిణీకి సన్నాహాలు

ఇప్పటి వరకు సిద్ధమైన 2,38,452 ఏకరూప దుస్తులు

రంగారెడ్డి అర్బన్‌, మే 29 : వేసవి సెలవుల తర్వాత ఏటా జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. తరగతులు ప్రారంభమై నెలలు గడుస్తున్నా... విద్యార్థులకు రకరకాల దుస్తుల్లో పాఠశాలకు వచ్చేవారు. అయితే.. ఇది ఒకప్పటి పరిస్థితి. ఈ సారి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ బడులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికీ విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే యూనిఫాం అందివ్వాలని నిర్ణయించారు. మార్చిలోనే యూనిఫాం తయారీకి అవసరమైన ముడి వస్త్రం మండల కేంద్రాలకు చేరింది. తెలంగాణ చేనేత సహకారం సంస్థ (టెస్కో) ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వస్త్రం కొనుగోలు చేసి జిల్లాలోని మండల కేంద్రాలకు పంపింది. అనంతరం పాఠశాల యాజమాన్యం కమిటీల్లో తీర్మానం చేసి దుస్తులను కుట్టే పనిని ఏజెన్సీ లేదా కుట్టు పనిచేసేవారికి అప్పగించింది. పాఠశాలల పునఃప్రారంభం రోజునే విద్యార్థులు యూనిఫాంతో హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో ఏకరూప దుస్తుల స్టిచ్చింగ్‌ వేగవంతం అవుతుండగా.. వికారాబాద్‌ జిల్లాలో కొంత జాప్యం జరుగుతోంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు రానున్న విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలు పునఃప్రారంభ సమయంలోనే యూనిఫాంలను అందజేసేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభం రోజే విద్యార్థుల చేతుల్లో పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులు పిల్లలకు అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది. దర్జీలపై ఒత్తిడి పెంచి ఈ నెలాఖరు వరకు కుట్టించాలని మండల స్థాయి అధికారులకు స్పష్టం చేసింది. పాఠశాలలు ప్రారంభం లోపు ఏక రూప దుస్తులను తరలించి విద్యార్థులకు అందించాలని లేని పక్షంలో సంబంధిత ప్రధానోపాధ్యాయుడే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. దీంతో నిర్దేశించిన సమయానికి ఏకరూప దుస్తులు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 2,962 ప్రభుత్వ బడులు ఉండగా 3,59,347 విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల ఏక రూప దుస్తుల కోసం 1754958 మీటర్లు క్లాత్‌ అవసరం కానుంది. ఇప్పటి వరకు అవసరమైన క్లాత్‌ను పూర్తి స్థాయిలో దర్జీలకు అందించారు. ఇప్పటి వరకు 2,38,452 జతలను సిద్ధం చేశారు. జూన్‌ మొదటి వారం నాటికి మిగతా దుస్తులు కుట్టేలా అధికారులు దర్జీలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మొదట్లో డిజైన్‌ మార్పులు, కుట్టుకూలి వంటి కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ.. ఈ సారి బడులు తెరిచేనాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేయాలని ముందుకు సాగుతున్నారు. జిల్లా స్థాయి సెక్టోరియల్‌ అధికారులు, మండల స్థాయిలో మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, క్లస్టర్‌ స్థాయిలో సీఆర్‌పీలు ప్రతి రోజూ టైలర్లతో మాట్లాడి జూన్‌ మొదటి వారం లోపు ఏకరూప దుస్తులు కుట్టించేలా చర్యలు తీసుకుంటున్నారు. వికారాబాద్‌ జిల్లాలో ఏక రూప దుస్తుల పంపిణీ ఈ సారి కొంత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ చేస్తాం

పాఠశాలలు పునఃప్రారంభించే నాటికి విద్యార్థులందరికీ రెండు జతల ఏక రూప దుస్తులను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటివరకు జిల్లాలో 1,39,932 దుస్తులు సిద్ధమయ్యాయి. మిగతావి త్వరగా కుట్టేలా చర్యలు తీసుకుంటున్నాము.

సుశీందర్‌రావు, రంగారెడ్డి జిల్లా విద్యాధికారి

చర్యలు తీసుకుంటున్నాం

ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి విద్యార్థులకు రెండు జతల ఏక రూప దుస్తులు పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. 97,363 మంది విద్యార్థులకుగాను 4,69,825 మీటర్ల క్లాత్‌ అవసరం కాగా మొత్తం క్లాత్‌ను సరఫరా చేశాము. ఇప్పటి వరకు 28,520 యూనిఫామ్స్‌ సిద్ధమయ్యాయి.

రేణుకాదేవి, వికారాబాద్‌ జిల్లా విద్యాధికారి

రంగారెడ్డి వికారాబాద్‌ మేడ్చల్‌

మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 1,353 1,094 515

మొత్తం విద్యార్థుల సంఖ్య 1,63,251 97,363 98,733

అవసరమైన క్లాత్‌ (మీటర్లు) 8,06,168.15 4,69,825 4,78,965

ఇప్పటి వరకు వచ్చింది (మీటర్లు) 8,06,168.15 4,69,825 4,78,965

కుట్టి రెడీగా ఉన్న జతలు 1,39,932 28,520 70,000

Updated Date - 2023-05-29T23:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising