ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉన్నచోట నుంచే ఓటు

ABN, First Publish Date - 2023-01-24T00:07:00+05:30

ఏ ఎన్నికల్లోనూ ప్రజలు వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. దూర ప్రాంతాల్లో ఉండే వలస కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వినియోగించుకునే సదుపాయం

ఈ నెలాఖరులోగా అభిప్రాయ సేకరణ పూర్తి

ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది వలస ఓటర్లు

అమల్లోకి వస్తే గణనీయంగా ఓటింగ్‌శాతం పెరిగే అవకాశం

ఏ ఎన్నికల్లోనూ ప్రజలు వంద శాతం ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. దూర ప్రాంతాల్లో ఉండే వలస కూలీలు, ఉద్యోగులు, విద్యార్థులు సొంతూరుకు వచ్చి ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. వ్యయ, ప్రయాసల కారణంగా ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉంటున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల సంఘం ‘రిమోట్‌ ఓటింగ్‌ సిస్టమ్‌’ను అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ విధానంపై ఈసీ అభిప్రాయాలను సేకరిస్తోంది. ఆయా పార్టీలు దీనిపై ఈనెల 31లోగా తమ అభిప్రాయాలను వెల్లడించాలని సూచించింది. ఈ విధానంలో ఓటు వేయాలనుకునే ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అవకాశం వస్తే జిల్లాలో అనేకమందికి లాభం చేకూరనుంది.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, జనవరి 23)

ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ దురదృష్టవశాత్తు ఏ ఎన్నికల్లోనూ ప్రజలు పూర్తిస్థాయిలో తమ ఓటు హక్కు వినియోగించుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో కనీసం సగం మంది కూడా ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల జరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితులతో ప్రజస్వామ్యానికి ముప్పు కలుగుతోంది. ఓటేసేందుకు ప్రజలంతా ముందుకు రావాలని ఎన్నికల సంఘం విస్తృత ప్రచారం చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో ఎన్నికల సంఘం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు వలస ఓటర్లకు తాము పనిచేసే చోటే తమ సొంత ప్రాంతానికి సంబంధించిన ఓటు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తోంది. వాస్తవానికి ఉపాధి కోసం అనేక ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు, కార్మికులు ఎన్నికల సమయంలో తమ సొంత ప్రాంతానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. ఎవరైనా ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతానికి వెళ్లాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీంతో వ్యయ ప్రయాసలు పడి తమ సొంత ప్రాంతాలకు వెళ్లి ఓటు వేసేందుకు అనేక మంది ఆసక్తిచూపడం లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని కూలీల్లో అత్యధిక మంది ఓటు హక్కు వినియోగానికి దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం రిమోట్‌ ఓటింగ్‌ సిస్టమ్‌ను అమల్లోకి తీసుకువచ్చే యత్నం చేస్తోంది. ఓటింగ్‌శాతం గణనీయంగా పెంచేందుకు దేశీయ వలస ఓటర్ల కోసం దీన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగులు, కార్మికులతోపాటు వలస కూలీలు, విద్యార్థులు తాము ఉంటున్న చోటు నుంచే తమ సొంత ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో ఓటువేసుకునే అవకాశం ఉంటుంది. కేవలం వలస ఓటర్లను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన మల్టీ కానిస్టియెన్సీ రిమోట్‌ ఓటింగ్‌ మెషిన్‌ ద్వారా ఒకే పోలింగ్‌ బూత్‌ నుంచి 72 నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్లు తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు వేయవచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలైన భారత ఎలకా్ట్రనిక్స్‌ లిమిటెడ్‌, ఎలకా్ట్రనిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా వీటిని రూపొందించాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు ఈనెల 16వ తేదీన రాజకీయపార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. అలాగే ఈ విధానంలో ఎదురయ్యే న్యాయ, కార్యనిర్వాహక, సాంకేతిక సమస్యలు, సవాళ్లపై అభిప్రాయాలను సేకరిస్తోంది. ఆయా పార్టీలు దీనిపై ఈనెల 31లోగా తమ అభిప్రాయాలను వెల్లడించాలని సూచించింది. మరోవైపు సాధారణ పౌరుల నుంచి కూడా అభిప్రాయాలను సేకరిస్తోంది. అయితే ఈ విధానంలో ఓటు వేయాలనుకునే ముందుగానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటేనే ఇలా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు.

లక్షల్లో వలస ఓటర్లు

ఉమ్మడి రంగారెడ్డిజిల్లాల్లో వలస ఓటర్లు లక్షల్లో ఉంటారు. ఒక్క రంగారెడ్డిజిల్లాల్లోనే వలస కార్మికుల కుటుంబాలు లక్షన్నర వరకు ఉన్నాయి. వలస కార్మికులతోపాటు వలస ఉద్యోగులు, విద్యార్థులు, చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు అత్యధికంగా ఉన్నారు. ఇటీవల ఓటరు ఐడీకి ఆధార్‌ అనుసంధానం చేయడంతో ఒక్కచోట మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. దేశంలో మరోచోట ఎక్కడైనా ఓటరుగా నమోదైతే సాంకేతిక పరిజ్ఞానంతో వెంటనే రెండోచోట ఉన్న ఓటును ఆప్షన్‌తో తొలగిస్తున్నారు. దీంతో ఎక్కువమంది సొంత ప్రాంతంలోనే ఓటు హక్కు పొందుతున్నారు. అయితే వీరిలో అనేక మంది ఎన్నికల సమయంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. సొంత ఊరుకు వెళ్లి ఓటు వేయడం వ్యయ, ప్రయాసలతో కూడుకున్నందున ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో కొన్నిచోట్ల కనీస స్థాయిలో కూడా ఓటింగ్‌ జరగడం లేదు. ఈ కారణంగా ఎన్నికల సమయంలో కొన్ని చోట్ల ఓటింగ్‌ శాతం తగ్గి ఫలితాలు కూడా తారుమారవుతున్నా యి. ఇప్పుడు కొత్త విధానం అమల్లోకి వస్తే ఓటింగ్‌ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.

సమస్యలు కూడా..

రిమోట్‌ ఓటింగ్‌ మిషన్లు అమల్లోకి వస్తే ఉన్నచోట నుంచే సొంత నియోజకవర్గాల్లో ఓటు వేసే అవకాశం కలుగుతుంది. అయితే ఈ సమయంలో అనేక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓటర్ల గుర్తింపు, ఏజెంట్ల లభ్యత, కౌంటింగ్‌ సమస్యలు తలెత్తుతాయి. మల్టీ కానిస్టియెన్సీ రిమోట్‌ ఓటింగ్‌ మెషిన్‌తో 72 నియోజకవర్గాల వారు ఇక్కడ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే వీరిని గుర్తించేది ఎవరు? సంబంధిత ప్రాంతానికి చెందిన ఓటర్లను గుర్తిం చేందుకు ఏజెంట్లను ఓటింగ్‌ కేంద్రానికి తీసుకురావడం అసంభవం. మరోవైపు ఇప్పటికే ఎలకా్ట్రనిక్‌ ఓటింగ్‌ మెషిన్ల పనితీరుపై ప్రధాన ప్రతిపక్షాలు అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయంలో ఇలాంటి విధానాన్ని అమల్లోకి తీసుకురావడం తగదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య

రంగారెడ్డి - 31,08,851

మేడ్చల్‌ - 24,24,957

వికారాబాద్‌ - 8,80,466

గతంలో పోలైన ఓట్ల శాతం

2014 - 65.7

2018 - 67.3

Updated Date - 2023-01-24T00:07:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising