ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Revanth Reddy: వేములవాడ రాజన్ననే మోసం చేసిన ఘనుడు కేసీఆర్‌: రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-03-05T21:08:58+05:30

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారితో పాటు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనుడు సీఎం కేసీఆర్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వేములవాడ: రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారితో పాటు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనుడు సీఎం కేసీఆర్‌ (CM KCR) అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. హాత్‌సే హాత్‌ జోడో యాత్ర (Hath Se Hath Jodo Yatra)లో భాగంగా ఆదివారం ఆయన రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2015లో సీఎం కేసీఆర్‌ వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని ఆలయ అభివృద్ధికి ఏటా వంద కోట్ల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి మాట తప్పాడని విమర్శించారు. మాటలు చెప్పడం మర్చిపోవడం ముఖ్యమంత్రి దినచర్యలో భాగమని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో వేములవాడ ఆలయ అభివృద్ధి ఆగిపోయిందని విమర్శించారు. భక్తుల కోరికలు తీర్చే రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని కోడెమొక్కు చెల్లించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కోట్లాది మంది భక్తులు దర్శించుకునే ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్‌ హయాంలోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ చొరవతో ఆలయ అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే అవసరాలకు అనుగుణంగా ఆలయాన్ని అభివృద్ధి చేసి అన్ని వసతులు కల్పిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

రాజన్న సేవలో రేవంత్‌రెడ్డి

రేవంత్‌రెడ్డి వేములవాడ రాజరాజేశ్వస్వామివారి సేవలో తరించారు. ఆదివారం ఉదయం ఆయన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ నేతృత్వంలో అర్చకులు ఆశీర్వదించగా, ఆలయ సూపరింటెండెంట్‌ బి తిరుపతిరావు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Updated Date - 2023-03-05T21:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising