Road Terror: పండుగపూట విషాదం.. స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్.. ఇద్దరు చిన్నారులు మృతి
ABN, First Publish Date - 2023-11-12T15:47:49+05:30
దీపావళి పండుగ రోజు ఆ కుటుంబంలో తీరని విషాదం నిండింది. రోడ్డు ప్రమాదం ఆ ఇంటి చిన్నారులను మింగేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్(Medak) పట్టణంలో అన్నపూర్ణ, తన ఇద్దరు పిల్లలు పృథ్వీ(12), ఫణితేజ్(10)లతో కలిసి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన టిప్పర్ వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టింది.
మెదక్: దీపావళి పండుగ రోజు ఆ కుటుంబంలో తీరని విషాదం నిండింది. రోడ్డు ప్రమాదం ఆ ఇంటి చిన్నారులను మింగేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్(Medak) పట్టణంలో అన్నపూర్ణ, తన ఇద్దరు పిల్లలు పృథ్వీ(12), ఫణితేజ్(10)లతో కలిసి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమంలో వెనక నుంచి వచ్చిన టిప్పర్ వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీ కొట్టింది.
దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. అన్నపూర్ణ తీవ్రంగా గాయపడింది. ఇద్దరు చిన్నారులను కోల్పోయిన ఆ తల్లి వేదన వర్ణనాతీతంగా మారింది. కొన్నాళ్ల క్రితం ఆమె భర్త శ్రీనివాస్ కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం.. తాజాగా పిల్లలు రోడ్డు ప్రమాదంలో మృత్యువు ఒడికి చేరడం చూపరులను కంటతడి పెట్టిస్తోంది.
Updated Date - 2023-11-12T15:47:53+05:30 IST