మోదీ హయాంలోనే పల్లెల అభివృద్ధి
ABN, First Publish Date - 2023-02-11T01:05:56+05:30
ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే పల్లెలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు.
మోదీ హయాంలోనే పల్లెల అభివృద్ధి
ప్రజా గోస - బీజేపీ భరోసా కార్నర్ సమావేశంలో నాయకులు
మునుగోడురూరల్, దేవరకొండ, మిర్యాలగూడటౌన, ఫిబ్రవరి 10: ప్రధాని నరేంద్రమోదీ హయాంలోనే పల్లెలన్నీ అభివృద్ధి చెందుతున్నాయని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. బీజే పీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని మునుగోడు, దేవరకొండ, మి ర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన ప్రజా గోస, బీజేపీ భరోసా కార్నర్ స మావేశంలో పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు. సగటు పేదవా డి కోసం కేంద్రప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరించారు. కిష్టాపురంలో నిర్మిస్తున్న కెమికల్ ఫ్యాక్టరీ పనులు ఆపకపోతే త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమంలో చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో నిధులు విడుదల కాక స ర్పంచులు ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శక్తి కేంద్ర ఇనచార్జి పులకరం సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మునుగోడు అసెంబ్లీ కన్వీనర్ దూడల భిక్షంగౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎరెడ్ల శ్రీని వాస్‌రెడ్డి, నాయకులు వేమిరెడ్డి నరేందర్‌రెడ్డి, బూడిద లింగయ్యయాదవ్, వేదాంతం గోపినాథ్, కిసాన మధుసూదనరెడ్డి, కిష్టాపురం సర్పంచ నందిపాటి రాధారమేష్, నాగరాజు, నరసింహ పాల్గొన్నారు.
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షు డు కంకణాల శ్రీధర్‌రెడ్డి, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేననాయక్ అన్నారు. దేవరకొండ పట్టణంలోని ముత్యాలమ్మబజార్‌లో నిర్వహించిన స మావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. పట్టణ ఉపాధ్యక్షుడు ఇడం రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు కర్నాటి సురేష్, చెనమోని రాములు, నరసింహ, ఏటి కృష్ణ, గుండాల అంజయ్య, గాజుల మురళి, లక్ష్మి, కళ్యాణ్‌నాయక్, లాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకా్‌షరెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలు అబద్ధాలు, అ సత్యాలతో పరిపాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర అందించేది కేంద్రప్రభుత్వమేనని పేర్కొన్నారు. పంచాయతీల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు చేస్తే ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకు ఖర్చు చేస్తూ కేంద్రంపై బురద జల్లడం తగదన్నారు. యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు నిధులు కేంద్రానివేనని, ఆహార భద్రత బియ్యం బీజేపీ సర్కారు అందిస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ దుష్ట పాలన ను అంతమొందించేందుకు శక్తికేంద్రాలు శక్తివంతంగా పని చేయాలని పి లుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలను విస్మరిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమావేశంలో అసెంబ్లీ పాలక్ కవిత, రాష్ట్ర నాయకులు సాధినేని శ్రీనివాసరావు, నియోజకవర్గ కన్వీనర్ రతనసింగ్‌నాయక్, నాయకులు పురుషోత్తంరెడ్డి, రమేష్, వెంకట్‌రెడ్డి, సత్యప్రసాద్, అశో క్, అశోక్‌రెడ్డి, అజయ్ సరిత తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-11T01:06:19+05:30 IST