Sanathnagar ESI Hospital: సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం
ABN, First Publish Date - 2023-09-16T22:44:52+05:30
సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పేషెంట్ సిస్టర్ (మైనర్) నోట్లో గుడ్డలు కుక్కి యువకుడు అత్యాచారం చేశాడు. ఈఎస్ఐ ఆస్పత్రి ఓపిడిలోని రెండో అంతస్తులో ఈ ఘటన జరిగింది. చేతికి గాయాలవడంతో ఓ బాలుడు ఈఎస్ఐ ఆస్పత్రి PMR వార్డులో చేరారు.
హైదరాబాద్: సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. ఓ పేషెంట్ సిస్టర్ (మైనర్) నోట్లో గుడ్డలు కుక్కి యువకుడు అత్యాచారం చేశాడు. ఈఎస్ఐ ఆస్పత్రి ఓపిడిలోని రెండో అంతస్తులో ఈ ఘటన జరిగింది. చేతికి గాయాలవడంతో ఓ బాలుడు ఈఎస్ఐ ఆస్పత్రి PMR వార్డులో చేరారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో బాలుడు ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలుడికి సహాయంగా అక్క (13) ఉంటోంది. ఆస్పత్రిలో ఫుడ్ సప్లై విభాగంలో పనిచేస్తున్న అజయ్ అనే యువకుడు బాధితురాలితో పరిచయం పెంచుకున్నాడు. నిన్న రాత్రి మైనర్ బాలికను నమ్మించి సెకండ్ ఫ్లోర్ లోని ఓపిడీకి తీసుకొచ్చాడు. అనంతరం బాధితురాలు నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడని బాధితురు తెలిపింది. అత్యాచారం అనంతరం అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. తనపై జరిగిన దారుణాన్ని ఆస్పత్రి సిబ్బందికి బాధితురాలు తెలియజేసింది.
దీంతో అక్కడే బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలు హత్యాచారానికి గురి అయిందని వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. అనంతరం బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఈఎస్ఐ ఆస్పత్రి అడ్డాగా మారుతోంది. పేషంట్ అటెండర్‌లను ఫుడ్ సప్లై విభాగంలో పనిచేస్తున్న కొందరు ఆకతాయిలు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని వరసగా ఆరోపణలు వినిస్తున్నాయి. ఇలాంటి వారిపై ఆస్పత్రి యాజమాన్యం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-09-16T22:48:27+05:30 IST