ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెక్కన్‌ కాంప్లెక్స్‌లో డ్రోన్‌ కెమెరాలతో సెర్చ్‌ ఆపరేషన్‌.. రెండు మృతదేహాలు గుర్తింపు

ABN, First Publish Date - 2023-01-20T17:45:12+05:30

రాంగోపాల్‌పేట్‌ డెక్కన్‌ కాంప్లెక్స్‌ (Deccan Complex)లో డ్రోన్‌ కెమెరాలతో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. సెకండ్‌ ఫ్లోర్‌లో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాంగోపాల్‌పేట్‌ డెక్కన్‌ కాంప్లెక్స్‌ (Deccan Complex)లో డ్రోన్‌ కెమెరాలతో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. సెకండ్‌ ఫ్లోర్‌లో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు కాలిపోయాయి. డెక్కన్‌ కాంప్లెక్స్‌లో ఉదయం 10.30 సమయంలో కార్‌డెకర్స్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ (Short circuit)తో మంటలంటుకున్నాయి. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినా.. వసీం, జాఫర్‌, జునైద్‌ అనే యువకులు భవనంలోకి దూసుకువెళ్లారు. వారిని వారించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించారు. ఆ ముగ్గురిని రక్షించేందుకు ఫైర్‌మెన్‌ లోనికి వెళ్లారు.

ఎంత ప్రయత్నించినా.. వారి జాడ దొరకలేదు. ఫోన్‌ (Phone) ద్వారా వారిని సంప్రదించేందుకు ఇతర వర్కర్లు ప్రయత్నించగా.. తొలుత రింగ్‌ అయిన ఫోన్‌లు.. ఆ తర్వాత స్విచాఫ్‌ అయ్యాయి. మొత్తం 40 ఫైరింజన్లతో సుమారు 9 గంటల పాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది.. రాత్రి 7.30 సమయంలో మంటలను నియంత్రించారు. వసీం, జాఫర్‌, జునైద్‌ కోసం అగ్నిమాపక సిబ్బంది లోనికి వెళ్లేందుకు యత్నించినా.. గోడలు ఇంకా వేడిగా ఉండడం.. భవనం గోడల ప్లాస్టరింగ్‌, పైకప్పు పెచ్చులుగా ఊడిపోతుండడంతో సాధ్యం కాలేదు. అయితే ఈ రోజు డెక్కన్‌ కాంప్లెక్స్‌లో రెండు మృతదేహాలను గుర్తించారు. మృతులు ఎవరు అనేది ఇంకా గుర్తించలేదు.

Updated Date - 2023-01-20T17:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising