Vandebharat: వందే భారత్ టికెట్ ధరలపై నెట్టింట ఆసక్తికర చర్చ.. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఎంతంటే..
ABN, First Publish Date - 2023-01-14T17:43:55+05:30
తెలుగు రాష్ట్రాల్లో ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది. జనవరి 15 నుంచి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి వెళ్లనున్న ‘వందే భారత్’ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా..
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ (Vandebharat Express) పరుగులు తీయనుంది. జనవరి 15 నుంచి సికింద్రాబాద్ నుంచి విశాఖపట్టణానికి (SEC to VSP) వెళ్లనున్న ‘వందే భారత్’ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఐఆర్‌సీటీసీ యాప్‌లో (IRCTC), వెబ్‌సైట్‌తో పాటు రైల్వే టికెట్స్ బుకింగ్ యాప్స్‌లో సికింద్రాబాద్ టూ విశాఖఫట్టణం (20834), విశాఖపట్నం టూ సికింద్రాబాద్ (20833) ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ టికెట్లను ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. ఆ టికెట్ ధరలపై ప్రయాణికుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొంతమంది మరీ ఇంతింత రేట్లా అంటుంటే.. మరికొందరమో లగ్జరీ ప్రయాణానికి ఈమాత్రం టికెట్ ధరలు సహజం అని చెబుతున్న పరిస్థితి.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లనున్న ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ (20834) టికెట్ ధరలు:
* సికింద్రాబాద్ టూ విశాఖపట్నం- AC Chair Car (CC)- 1665 రూపాయలు, Executive Class (EC)- 3120 రూపాయలు
* సికింద్రాబాద్ టూ రాజమండ్రి- AC Chair Car (CC)- 1365 రూపాయలు, Executive Class (EC)- 2485 రూపాయలు
* సికింద్రాబాద్ టూ విజయవాడ- AC Chair Car (CC)- 905 రూపాయలు, Executive Class (EC)- 1775 రూపాయలు
* సికింద్రాబాద్ టూ వరంగల్- AC Chair Car (CC)- 520 రూపాయలు, Executive Class (EC)- 1005 రూపాయలు
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడవనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (20833) ధరలు:
* విశాఖపట్నం టూ సికింద్రాబాద్- AC Chair Car (CC)- 1720 రూపాయలు, Executive Class (EC)- 3170 రూపాయలు
* రాజమండ్రి టూ సికింద్రాబాద్- AC Chair Car (CC)- 1425 రూపాయలు, Executive Class (EC)- 2535 రూపాయలు
* విజయవాడ టూ సికింద్రాబాద్- AC Chair Car (CC)- 1060 రూపాయలు, Executive Class (EC)- 1915 రూపాయలు
* వరంగల్ టూ సికింద్రాబాద్- AC Chair Car (CC)- 725 రూపాయలు, Executive Class (EC)- 1235 రూపాయలు
ఈ ట్రైన్ ధరలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లేటప్పుడు ధర కంటే, విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు టికెట్ ధరలు పెరిగాయి. ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ షెడ్యూల్ వల్లే ఈ టికెట్ ధరల్లో వ్యత్యాసం ఉన్నట్లు తెలిసింది. ఈ ట్రైన్‌లో మార్నింగ్ టీ, టిఫిన్, ఆఫ్టర్‌నూన్ లంచ్, నైట్ డిన్నర్ అందించనున్నారు.
ఇదిలా ఉండగా.. ‘వందే భారత్’ ట్రైన్ తెలుగు రాష్ట్రాల మధ్య పరుగులు తీయనున్న సమయంలో ఒక ఆసక్తికర చర్చ తెరపైకొచ్చింది. ఈ రైలు విషయంలో కూడా తెలంగాణలో రాజకీయం నడుస్తోంది. హైదరాబాద్ టూ వరంగల్ మధ్య నడిచే గరుడ ప్లస్ వోల్వో బస్సు టికెట్ 480 రూపాయలు ఉంది. ప్రయాణానికి 2.30 గంటల సమయం పడుతుంది. అదే ‘వందే భారత్’ ఎక్స్‌ప్రెస్ రైలు అయితే.. సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు 520 రూపాయల టికెట్‌తో ఒక గంట 35 నిమిషాల వ్యవధిలోనే వెళ్లనుంది. ఈ రెండు ధరలను, ప్రయాణ సమయాన్ని పోల్చుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయాణికులను దోచుకుంటుందంటూ కొందరు బీజేపీ మద్దతుదారులు ట్విట్టర్ వేదికగా పోస్టులు పెడుతున్నారు.
బీఆర్‌ఎస్ నుంచి కూడా కౌంటర్ ట్వీట్లు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే నడుస్తున్న ‘వందే భారత్’ రైళ్లు షెడ్యూల్‌లో పేర్కొన్న సమయం కంటే ఆలస్యంగా నడుస్తున్నాయని, టికెట్ల ధరలు భారీగా పెట్టడం మీద పెట్టిన శ్రద్ధ సమయానికి ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేయడంపై పెట్టాలని కౌంటర్ ఇస్తున్నారు
Updated Date - 2023-01-14T17:45:16+05:30 IST