ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Old man died : ఎస్సై దాడి.. వృద్ధుడి మృతి

ABN, First Publish Date - 2023-12-12T03:22:24+05:30

అప్పు, భూ వివాదంపై ఫిర్యాదు రావడంతో ఓ వృద్ఢుడిని స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై, ఆయనపై చేయి చేసుకున్నాడు. కొద్దిసేపటికే ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థత గురై వాంతులు ..

మెడపై కొట్టిన అధికారి.. వృద్ధుడికి వాంతులు.. అప్పు, భూ వివాదాల పంచాయితీ నేపథ్యంలో ఘటన

నల్లగొండ జిల్లా చింతపల్లిలో విషాదం.. ఆందోళన

ఇంట్లో ఒకరికి జాబ్‌, ఐదెకరాల అసైన్డ్‌ భూమి ఇస్తామని హామీ

ఘటనపై స్పందించిన ఎస్పీ.. ఎస్సైని సస్పెండ్‌చేస్తూ ఉత్తర్వులు

చింతపల్లి, హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): అప్పు, భూ వివాదంపై ఫిర్యాదు రావడంతో ఓ వృద్ఢుడిని స్టేషన్‌కు పిలిపించిన ఎస్సై, ఆయనపై చేయి చేసుకున్నాడు. కొద్దిసేపటికే ఆ వృద్ధుడు తీవ్ర అస్వస్థత గురై వాంతులు చేసుకొని మృతిచెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి ఈ ఘటన జరిగింది. పోలీసులు, మృతుడి బంధువుల వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన నేనావత్‌ సూర్య (65) హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటున్నాడు. ఆయనకు ముగ్గురు సోదరులున్నారు. స్వగ్రామంలో సూర్య తల్లి పేరిట ఉన్న నాలుగు ఎకరాల సాగు భూమిని నలుగురూ సమానంగా పంచుకున్నారు. కాగా సూర్యకు చెందిన భూమిలో కొంత భాగాన్ని ఊర్లోనే ఉంటున్న తమ్ముడు భీమా సాగు చేసుకుంటున్నాడు. భీమా వద్ద సూర్య కుమారుడు కిరణ్‌ రూ.3లక్షల అప్పు తీసుకున్నాడు. డబ్బు తిరిగిచ్చేయాలని భీమా అడిగితే.. తమ భూమిని కొంత పట్టా చేయించుకున్నావని, ఆ సమస్య పరిష్కారమైతేనే అప్పు తీరుస్తానని కిరణ్‌ తేల్చిచెప్పాడు. విషయం పెద్ద మనుషుల వరకు చేరడంతో రెండు నెలల కిందట భీమా తన పేరిట ఎక్కువగా ఉన్న భూమిని సోదరుడు సూర్యనాయక్‌ పేరిట చేయించాడు. అయితే పట్టా చేయించినా.. కిరణ్‌ అప్పు తీర్చకపోవడంతో విసిగిపోయిన భీమా, ఈనెల 8న చింతపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

స్పందించిన ఎస్సై సతీశ్‌ రెడ్డి.. సూర్య, అతడి కుమారుడు కిరణ్‌ను పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించాలని అదేరోజు సిబ్బందిని ఆదేశించాడు. అయితే ఇద్దరూ ఆదివారం సాయంత్రం స్టేషన్‌కు వచ్చారు. తాను స్టేషన్‌కు రావాలని ఫోన్‌ చేయిస్తే రెండ్రోజులు ఆలస్యంగా వస్తారా? అంటూ ఆగ్రహోదగ్రుడైన ఎస్సై సతీశ్‌ రెడ్డి, ఇద్దరిపైనా చేయిచేసుకున్నాడు. సూర్య మెడపై ఎస్సై బలంగా చేయి చేసుకోవడంతో బాధితుడు అస్వస్థతకు గురై అక్కడే వాంతులు చేసుకున్నాడు. పోలీస్‌ సిబ్బంది, కుటుంబ సభ్యులు సూర్యను దేవరకొండ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. ఎస్‌ఐ చేయి చేసుకోవడంతోనే సూర్య మృతి చెందాడని ఆరోపిస్తూ ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మృతదేహాన్ని చింతపల్లి పోలీ్‌సస్టేషన్‌కు తరలించి అక్కడే ధర్నా చేయాలని మృతుని బంధువులు ఏర్పాట్లు చేస్తుండగా పోలీసులు అడ్డుకుని దేవరకొండ ఆస్పత్రి మార్చురీలో మృతదేహాన్ని భద్రపర్చారు.

ఎస్సైని సర్వీసు నుంచి తొలగించాలి

సూర్యపై భౌతికదాడికి దిగి ఆయన మృతికి కారణమైన ఎస్సై సతీశ్‌రెడ్డిని సర్వీసు నుంచి తొలగించాలని, 307, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని తెలంగాణ గిరిజన సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి రమావత్‌ అజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా సూర్య మృతిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ లాకప్‌ డెత్‌గా పేర్కొన్నారు. పోలీసు లాక్‌పలో ఎప్పుడూ పేదవాళ్లే తప్ప.. ఆధిపత్య వర్గాలు చనిపోరని అన్నారు. సూర్యది లాక్‌పడెత్‌ అని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు.

ఘటనపై స్పందించిన ఎస్పీ

ఎస్సై దురుసు ప్రవర్తనపై జిల్లా ఎస్పీ అపూర్వ రావు వెంటనే స్పందించారు. ఆదివారం రాత్రే పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లిన ఆమె ఈ ఘటనకు బాధ్యుడైన ఎస్సై సతీ్‌షరెడ్డిని పోలీస్‌ హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం విచారణ చేపట్టి ఎస్సైనా సస్పెండ్‌ చేశారు. సూర్య మెడపై ఎస్సై కొట్టిన దెబ్బ మినహా మరోచోట గాయాలు లేవని, సూర్య వయస్సు 65 కావడం.. లోబీపీ ఆపై గుండెపోటు మూలంగా మృతి చెందాడని దేవరకొండ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాములు నిర్ధారించారని ఎస్పీ అపూర్వరావు తెలిపారు.

మృతదేహంతో ఆందోళన...

సూర్య మృతదేహంతో చింతపల్లి పోలీ్‌సస్టేషన్‌ వద్ద ధర్నా చేస్తారన్న సమాచారం ముందస్తుగా రావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పోలీస్‌ అధికారులను చింతపల్లికి రప్పించారు. స్థానిక డీఎస్పీ గిరిబాబు దేవరకొండ సివిల్‌ ఆస్పత్రికి వెళ్లి సూర్య బంధువులతో మాట్లాడి ఏఎస్సైపై చర్యలు తీసుకోవడంతో పాటు శాఖాపరంగా మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం సూర్య మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన పాలెం తండాకు సోమవారం తీసుకెళ్లారు. పాలెం తండాలోని సూర్యనాయక్‌ ఇంటి ఎదుట మృతదేహాన్ని ఉంచారు. సూర్యనాయక్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని.. డిమాండ్లు నెరవేరే దాకా అంత్యక్రియలు పూర్తి చేసేది లేదని సూర్య బంధువులు సోమవారం ఉదయం బీష్మించుకుని కూర్చున్నారు. సోమవారం రాత్రి 7:30గంటల ఆర్డీవో శ్రీరాములు, డీఎస్పీ గిరిబాబు సూర్యనాయక్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగంతో పాటు ఐదు ఎకరాల అసైన్డ్‌భూమి ఇచ్చేందుకు హామీ పత్రం ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2023-12-12T03:22:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising