ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Singareni Elections: సాధారణ ఎన్నికల పోలింగ్‌ను తలపిస్తున్న సింగరేణి ఎన్నికలు

ABN, Publish Date - Dec 27 , 2023 | 08:20 AM

సాధారణ ఎన్నికల పోలింగ్‌ను సింగరేణి ఎన్నికలు తలపిస్తున్నాయి. భూపాలపల్లిలోని 9 పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు హక్కును వినియోగించుకునేందుకు కార్మికులు బారులు తీరారు.

జయశంకర్ భూపాలపల్లి : సాధారణ ఎన్నికల పోలింగ్‌ను సింగరేణి ఎన్నికలు తలపిస్తున్నాయి. భూపాలపల్లిలోని 9 పోలింగ్ కేంద్రాల దగ్గర ఓటు హక్కును వినియోగించుకునేందుకు కార్మికులు బారులు తీరారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సింగరేణి మణుగూరు ఏరియాలో గుర్తింపు సంఘ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. అధికారులు జిల్లాలో 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ అమలు చేశారు. 2452 మంది కార్మికులు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ చేతిలో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌.. సింగరేణి ఎన్నికల్లో హస్తం పార్టీని దెబ్బకొట్టే వ్యూహం పన్నింది. ఎన్నికల చివరి దశలో అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ ఎన్నికల్లో సీపీఐ అనుబంధ సంఘం ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ అనుబంధ టీబీజీకేఎస్‌ నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్‌ శ్రేణులు డివిజన్ల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో తీర్మానాలు చేశాయి.

Updated Date - Dec 27 , 2023 | 08:20 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising