గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి స్థల పరిశీలన
ABN, First Publish Date - 2023-06-26T00:53:22+05:30
మునుగోడు నియోజకవర్గంలోని మ హాత్మా జ్యోతిరావు పూలే ప్రభుత్వ వెనుకబడిన త రగతుల బాలికల గురుకుల పాఠశాల నూతన పక్కా భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్థలాన్ని ప రిశీలించారు.
గురుకుల పాఠశాల భవన నిర్మాణానికి స్థల పరిశీలన
చండూరు రూరల్, జూన 25: మునుగోడు నియోజకవర్గంలోని మ హాత్మా జ్యోతిరావు పూలే ప్రభుత్వ వెనుకబడిన త రగతుల బాలికల గురుకుల పాఠశాల నూతన పక్కా భవన నిర్మాణానికి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి స్థలాన్ని ప రిశీలించారు. మండల ప రిధిలోని దోనిపాముల గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆదివారం పరిశీలించారు. పాఠశాల నిర్మాణానికి అనువైనదిగా గుర్తించి స్థల నిర్ధారణ చేశారు. వెం టనే సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి, త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయ న వెంట పాఠశాల ప్రిన్సిపాల్ తిరందాసు నర్మద, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, నాయకులు కోడి వెంకన్న, దాసరి స్వామి, పర్సనబోయిన పాండు, భూతరాజు దశరథ, చంద్రయ్య, వెంకన్న, దశరథ, సైదులు, శం కర్, నరసింహ, యాదగిరి, రవి ఉన్నారు.
Updated Date - 2023-06-26T00:53:22+05:30 IST