గద్దర్ కుటుంబ సభ్యులకు సోనియా ఓదార్పు
ABN, First Publish Date - 2023-09-18T04:15:36+05:30
ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఓదార్చారు.
హైదరాబాద్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబ సభ్యులను ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఓదార్చారు. తాజ్ కృష్ణా హోటల్‌లో ఆదివారం గద్దర్ భార్య విమల, కూతురు వెన్నెల, కుమారుడు సూర్యం.. ఆయన భార్యను వారు కలిసి ధైర్యం చెప్పారు. వాస్తవానికి సోనియా గాంధీనే గద్దర్ ఇంటికి వెళ్లాలనుకున్నారు. ఆమె అనారోగ్య పరిస్థితి రీత్యా వారినే హోటల్‌కు పిలుపించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల హక్కుల కోసం గద్దర్ పోరాట స్ఫూర్తిని సోనియా కొనియాడారు.
Updated Date - 2023-09-18T04:15:36+05:30 IST