శ్రీ చైతన్య అధినేత బీఎస్ రావుకు ప్రముఖుల నివాళి
ABN, First Publish Date - 2023-07-24T03:41:54+05:30
శ్రీ చైతన్య విద్యా సంస్థల ద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా దాత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్ రావు) సంస్మరణ కార్యక్రమం ఆదివారం ఏపీ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగింది. వివిధ రంగాల్లోని ప్రముఖులు హాజరై బీఎస్ రావు చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.
మంగళగిరి సిటీ/హైదరాబాద్, జూలై 23: శ్రీ చైతన్య విద్యా సంస్థల ద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా దాత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బీఎస్ రావు) సంస్మరణ కార్యక్రమం ఆదివారం ఏపీ మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో జరిగింది. వివిధ రంగాల్లోని ప్రముఖులు హాజరై బీఎస్ రావు చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఏపీఎ్‌సఎ్‌ఫఎల్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, ఇతర ప్రముఖులు హాజరై బీఎస్ రావు సేవలను స్మరించుకున్నారు. శ్రీ చైతన్య విద్యాసంస్థల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యారంగం అభివృద్ధికి బీఎస్ రావు ఎంతగానో కృషి చేశారని, లక్షలాది మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడంతోపాటు వేలాది మందికి ఉపాధి కల్పించారని కొనియాడారు. బీఎస్ రావు సతీమణి, శ్రీచైతన్య విద్యా సంస్థల చైర్‌పర్సన్ డాక్టర్ బొప్పన ఝాన్సీ లక్ష్మీబాయి, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీఎస్ రావుకు నివాళులు అర్పించేందుకు శ్రీచైతన్య విద్యా సంస్థల నుంచి అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది వేలాదిగా తరలివచ్చారు. ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీచైతన్య మెయిన్ బ్రాంచీలలో బీఎస్ రావు సంస్మరణ సభలను నిర్వహించారు.
Updated Date - 2023-07-24T03:41:54+05:30 IST