కడుపులో మంట మంట!
ABN, First Publish Date - 2023-08-06T03:46:33+05:30
ముక్కలేనిదే ముద్ద దిగదు..! అది కూడా ఘాటుగా మసాలాలు దట్టించిన ముక్క అయి ఉండాలి..! అలా్ట్ర ప్రాసెస్డ్ ఫుడ్, జంక్‌ఫుడ్, వేపుళ్లు ఉంటే..
తెలంగాణలో పెరుగుతున్న ఐబీడీ
30,835లో 1680 మందికి వ్యాధి
ఏఐజీ ఆస్పత్రుల అధ్యయనం
లాన్సెట్ జర్నల్‌లో ప్రచురణ
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ముక్కలేనిదే ముద్ద దిగదు..! అది కూడా ఘాటుగా మసాలాలు దట్టించిన ముక్క అయి ఉండాలి..! అలా్ట్ర ప్రాసెస్డ్ ఫుడ్, జంక్‌ఫుడ్, వేపుళ్లు ఉంటే.. లొట్టలేసుకుని తింటారు..! కనీసం బిర్యానీ, పన్నీర్‌బటర్ మసాలా, మంచూరియా, బాగా ఫ్రైచేసిన నాన్‌వెజ్.. వారానికోసారైనా టేస్ట్ చేయాల్సిందే..! ఇదీ నగరాలు, పట్టణాల్లో ప్రజల ఆహార అలవాట్లలో వేగంగా వస్తున్న మార్పులకు నిదర్శనం. అయితే.. మసాలాలు ఎక్కువగా ఉండే వంటలు.. నూనెను పదేపదే ఉపయోగించి చేసే ఆహారపదార్థాలు ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్(ఐబీడీ)కు దారితీస్తున్నట్లు ఏఐజీ ఆస్పత్రుల పరిశోధన తేల్చింది. భారత్‌లో 15 లక్షల మందికి పైగా ఐబీడీతో బాధపడుతుండగా.. తెలంగాణలో వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. తెలంగాణలో నిర్వహించిన ఏఐజీ పరిశోధన లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైంది. గడిచిన మూడేళ్లలో తెలంగాణలోని 150 గ్రామాలు, నగరాలు, పట్టణాల్లో 1.75 లక్షల మందిపై ఈ సర్వే నిర్వహించగా.. తాజాగా 30,835 మందిపై పరిశోధన జరిపినట్లు ఏఐజీ గ్రూప్ ఆస్పత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. ‘‘మా పరిశోధన ఇంకా కొనసాగుతోంది. గతంలో కంటే ఐబీడీతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది. శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాను జంక్‌ఫుడ్ దెబ్బతీస్తోంది’’ అని ఆయన వివరించారు. 30,835 మందిలో 1,680 మంది (5.4%) ఐబీడీతో బాధపడుతున్నట్లు తేలిందన్నారు. 2006లో తాము తొలిసారి పరిశోధన/సర్వే జరిపినప్పుడు 0.1% మంది మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ఐబీడీలోజీర్ణకోశంతో 364 మంది(1.2ు), 488 (1.6%) మంది కోలరెక్టల్ క్యాన్సర్‌తో బాధతున్న ట్లు తేలిందని డాక్టర్ రూపా బెనర్జీ వివరించారు. క్రానిక్ డిసీజ్‌తో 688(2.2%), రక్త విరేచనాలతో 16%, పేగు క్షయ వ్యాఽధితో 12%, రక్తహీనతతో 6%, పెద్ద పేగు క్యాన్సర్‌తో 16%, దీర్ఘకాలిక అతిసారతో 13%, పెద్ద పేగు నొప్పితో 4.6% మంది బాధపడుతున్నట్లు తేలిందన్నారు. 20 నుంచి 40 సంవత్సరాల మధ్య యువకులు ఎక్కువగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని వివరించారు.
Updated Date - 2023-08-06T03:46:33+05:30 IST