సుఖేందర్‌రెడ్డీ... ప్రెజెంట్ సార్
ABN, First Publish Date - 2023-03-01T01:30:42+05:30
సుఖేందర్‌రెడ్డీ... అంటూ నాటి గురువు లు హాజరు తీసుకోగా ప్రెజెంట్ సార్ అంటూ శాసనమండలి చైర్మన సమాధానమిచ్చారు... పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్వగృహం ఈ వేడుకకు వేదికైంది.
సుఖేందర్‌రెడ్డీ... ప్రెజెంట్ సార్
53 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం
బాల్య మిత్రులను కలవడం సంతోషంగా ఉంది: గుత్తా
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లలో వేడుక
చిట్యాలరూరల్, ఫిబ్రవరి 28: సుఖేందర్‌రెడ్డీ... అంటూ నాటి గురువు లు హాజరు తీసుకోగా ప్రెజెంట్ సార్ అంటూ శాసనమండలి చైర్మన సమాధానమిచ్చారు... పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని గుత్తా సుఖేందర్‌రెడ్డి స్వగృహం ఈ వేడుకకు వేదికైంది. నాటి విద్యార్థి, ప్రస్తుత శాసనమండలి చైర్మన గుత్తా సుఖేందర్‌రెడ్డి స్వగృహంలో 1969-70 చిట్యాల జడ్పీహెచఎ్‌స పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులకు 70 సంవత్సరాలు కాగా, నాటి గురువులకు 90 సంవత్సరాలు దాటా యి. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన గురువులను చైర్మన సుఖేందర్‌రెడ్డితో పాటు పూర్వ విద్యార్థులంతా సాదరంగా స్వాగతం పలికా రు. నాటి ప్రధానోపాఽధ్యాయుడు ఎం.అంజిరెడ్డి పూర్వ విద్యార్థుల జాబితా తీసుకుని పాఠశాలలో మాదిరిగా హాజరు తీసుకోగా పూర్వ విద్యార్థులంతా ప్రెజెంట్ సార్ అంటూ ఉత్సాహంతో హాజరు పలికారు. సుమారు 60 మందికి గాను 11మంది మృతిచెందగా కొందరికి అనారోగ్య సమస్యలుండగా 40మంది కార్యక్రమానికి హాజరయ్యారు. నాటి గురువులైన ప్రధానోపాధ్యాయుడు ఎం.అంజిరెడ్డి, ఉపాధ్యాయులు జయారపు కిష్టయ్య, బైరు అంజయ్య కిష్టయ్యలను సుఖేందర్‌రెడ్డి ఘనంగా సన్మానించి నూతన వసా్త్రలను అందజేశారు. ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులు మాట్లాడుతూ చిన్ననాటి నుండి ఎంతో చురుగ్గా ఉన్న సుఖేందర్‌రెడ్డి శాసనమండలి చైర్మనగా ఎదగ డం ఎంతో గర్వంగా ఉందని అభినందించారు. పూర్వ విద్యార్థుల్లో ముగ్గురు గతంలో మృతిచెందటంతో వారి కుటుంబాలకు సుఖేందర్‌రెడ్డి రూ. 25వేల చొప్పున ముగ్గురికి రూ.75వేలు, నూతన వసా్త్రలను అందజేశారు. పూర్వ వి ద్యార్థుల సమ్మేళనంలో అప్పటి విద్యార్థులు శీలా రాజయ్య, ఇరుకుళ్ల ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-01T01:30:42+05:30 IST