కేసీఆర్ కయ్యానికి కాలుదువ్వడానికి కారణం చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే
ABN, First Publish Date - 2023-04-09T18:51:38+05:30
ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వంలో అన్ని రాష్ట్రాలను సమ దృష్టితో చూస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) అన్నారు.
సిద్దిపేట: ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వంలో అన్ని రాష్ట్రాలను సమ దృష్టితో చూస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు (MLA Raghunandan Rao) అన్నారు. ప్రతి పక్షాలను కూడా ఆహ్వానించి తమ సంసృతి చేరుకున్నామన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ (BJP) జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి (Srikanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడారు. స్టాలిన్ మోడీ నీ సాదర స్వాగతం పలికితే కేసీఆర్ (KCR) ఎందుకు పలకడం లేదన్నారు. ఆహ్వానానికి ముఖ్యమంత్రి రాకుంటే మంత్రులు రావాలని రాజ్యంగంలో ఉందా? అని ఆయన ప్రశ్నించారు. వ్యతిరేకించే వెస్ట్ బెంగాల్ దిది కూడా మోదీని స్వాగతించారని గుర్తుచేశారు. తెలంగాణలో రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ కలుషితం చేస్తుందన్నారు. పీకే సలహా వల్లే కేసీఆర్ కయ్యానికి కాలుదువ్వుతున్నారని ఆరోపించారు. దొంగే దొంగా అన్నట్లు ఉంది కేసీఆర్ పరిస్థితి అని విమర్శించారు. మళ్ళీ ఎన్నికల వరకు సిద్దిపేటలో రైలు ఆగుతుందన్నారు. దుబ్బాకలో బీజేపీ గెలవడం వల్లే నిధులు అపుతు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుబ్బాక ఎమ్మెల్యేకు జిల్లా గ్రంథాలయంకు పోటోకాల్ సంబంధం ఉండదా? ఇది విషం చిమ్మడం కదా? అని ప్రశ్నించారు. రాజ్ దిప్ సర్ దేశాయ్‌కి ప్రతి పక్షాల కూటమికి తనను చైర్మన్ చేయలనాడం దేనికి సంకేతమన్నారు. మోడీకి కేసీఆర్ ముఖం చాటేశారని అన్నారు. అభివృద్ధి అనేది సంతులితంగా జరగాలని సూచించారు. మనకంటే పెద్దవారు వస్తే గౌరవించాలి అని అంబేడ్కర్ రాజ్యాంగంలో ఉందన్నారు. సూర్యుని మీద ఉమ్మేసినట్టు బీఆర్ఎస్ పరిస్థితి ఉందన్నారు. దుబ్బాక ప్రజలపై అక్కసు చూపెడుతున్నారని మండిపడ్డారు.
Updated Date - 2023-04-09T18:51:38+05:30 IST