ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Seethakka: ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-08T16:33:45+05:30

ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ను గ్రానైట్స్‌తో పేల్చేయాలంటూ టీపీపీసీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది...? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహబూబాబాద్: ప్రజలకు ఉపయోగపడని ప్రగతి భవన్‌ను గ్రానైట్స్‌తో పేల్చేయాలంటూ టీపీపీసీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది...? అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) అన్నారు. కేసీఆర్ (CM KCR) కూడా నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అన్నారు కదా..? ఆమె ప్రశ్నించారు. నక్సలైట్ల ఎజెండాలో దొరల గడీలు బద్దలుకొట్టే అంశం కూడా ఉందన్నారు. ఇప్పటి బీఆర్ఎస్‌ (BRS)లో ఉన్నవాళ్లలో మాజీ నక్సలైట్లు లేరా...? అని సీతక్క ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై నిరసనలు చేయడం తమకు ఆశీర్వాదంతో సమానమన్నారు.

అసలు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..?

ప్రగతిభవన్‌‌ను (Bragathi Bhavan) కూల్చివేయాలన్న తన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నేతలు (BRS Leader) ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy) స్పందించారు. ‘‘నేను కేసులకు భయపడను.. నాకు కేసులు కొత్త కాదు. కేసీఆర్ భూతం లాంటివారు... పట్టి సీసాలో బంధించాలి.... లేకపోతే తట్టుకోలేం’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తులన్నీ కాంగ్రెస్‌కు (Congress) సపోర్టు చేయాలని పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాలకు అనమతి లేని ప్రగతిభవన్ ఎందుకని మరోసారి నిలదీశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) సిద్ధాంతం మంచిదే అని... ఆయన ఎంచుకున్న బీజేపీ విధానం సరైంది కాదన్నారు. పొంగులేటి కాంగ్రెస్‌లోకి వస్తే ఆహ్వానిస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వాని (KCR Government)కి రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. తెలంగాణ ద్రోహులకే మంత్రి వర్గంలో 90 శాతం పదవులు అప్పజెప్పారని రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ములుగు జిల్లాలో ‘‘హాత్‌ సే హాత్ జోడో’’ యాత్ర (Hath se Hath Jodo Yatra) భాగంగా ప్రగతిభవన్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. పేదలకు ఉపయోగం లేని ప్రగతిభవన్ ఎందుకని ప్రశ్నించారు. ప్రగతిభవన్‌ను నక్సలైట్లు పేల్చేయాలని అన్నారు. ఆనాడు దొరల గడీలను పేల్చేసిన నక్సలైట్లు నేడు ప్రగతి భవన్‌ను లేకుండా చేసినా అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రేవంత్ కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆ సమయంలోనే మైక్ కట్ అవుతుందని ఈటల ఆగ్రహం

కేసీఆర్ ఫామ్హౌజ్లో తాంత్రిక పూజలు చేయ్యం కానీ..: హరీశ్

Updated Date - 2023-02-08T16:33:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising