Revanth Reddy: వాళ్ళిద్దరూ సైబర్ నేరగాళ్లు: రేవంత్ రెడ్డి
ABN, First Publish Date - 2023-06-14T21:20:57+05:30
ధరణి పోర్టల్ పేరుతో దోపిడీకి తెరలేపారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
హైదరాబాద్: ధరణి పోర్టల్ పేరుతో దోపిడీకి తెరలేపారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ప్రభుత్వ పనిని ధరణి పేరుతో ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారని అన్నారు. దివాళా తీసిన కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. రాష్ట్రంలో భూలావాదేవీలన్నీ ధరణి పోర్టలే నిర్వహిస్తోందన్నారు. కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) సైబర్ నేరగాళ్లు అని విమర్శించారు. ధరణి అనేది కేవలం సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు.. అది కేసీఆర్ దోపిడీకి గేట్ వే అని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తన దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ధరణిలో జరిగిన లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలని డిమాండ్ చేశారు. ధరణి లావాదేవీలపై తక్షణమే కాగ్ నివేదిక కోరాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Updated Date - 2023-06-14T21:43:13+05:30 IST