TS News: వాటిని గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ: తలసాని
ABN, First Publish Date - 2023-01-25T19:59:12+05:30
అక్రమ కట్టడాలు, ఫైర్ సేఫ్టీ పాటించని భవనాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని నియమించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు.
హైదరాబాద్: అక్రమ కట్టడాలు, ఫైర్ సేఫ్టీ పాటించని భవనాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని నియమించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) అన్నారు. ఈ కమిటీ ప్రభుత్వ భవనాలను కూడా పరిశీలిస్తుందన్నారు. త్వరలోనే స్పెషల్ డ్రైవ్ ప్రారంభిస్తామని ఆయన తెలపారు. రేపటి నుంచి డెక్కన్‌మాల్ కూల్చివేత పనులు ఉంటాయన్నారు. డెక్కన్ మాల్ మృతులకు రూ.5లక్షల పరిహారం ఇచ్చామన్నారు. అలాగే రిపబ్లిక్ డే వేడుకలు నిబంధనల మేరకు జరుగుతాయని తలసాని పేర్కొన్నారు. ఇందులో రాజకీయం ఏమీ లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ బర్త్‌డే రోజు సచివాలయం ప్రారంభిస్తే తప్పేంటి? అని ఆయన ప్రశ్నించారు. ప్రతి దాన్ని వివాదం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-01-25T19:59:15+05:30 IST