ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణ ఏర్పాటు

ABN, First Publish Date - 2023-11-30T04:05:20+05:30

కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు సిద్ధించాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

నవంబరు 29 అంటే ఢిల్లీ మెడలు వంచిన దినం

ఆనాడే తెలంగాణ ఇచ్చి ఉంటే బలిదానాలు జరిగేవా?

దీక్షాదివస్‌ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, నవంబరు 29, ఆంధ్రజ్యోతి : కేసీఆర్‌ దీక్షతోనే తెలంగాణకు స్వేచ్ఛా వాయువులు సిద్ధించాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. 2009 నవంబరు 29న కేసీఆర్‌ దీక్షకు పూనుకున్న సందర్భంగా నిర్వహించే దీక్షాదివస్‌ కార్యక్రమాన్ని బుధవారం సిద్దిపేటలో నిర్వహించారు. రంగధాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. అనంతరం తన ఇంటి వద్ద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఢిల్లీ పాలకుల మెడలు వంచిన రోజుగా నవంబరు 29 చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. దీక్ష చేయబోతున్న కేసీఆర్‌ను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రా సరిహద్దులో ఉన్న ఖమ్మం జైలుకు తీసుకెళ్లారని గుర్తుచేశారు. ఆనాటి పరిస్థితులను చూస్తే కేసీఆర్‌ను ఎన్‌కౌంటర్‌ చేస్తారేమోననే భయం కలిగిందన్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఏకం కావడంతో కేసీఆర్‌ను ఏమి చేయలేకపోయారన్నారు. ఈ దీక్ష ఫలితంగానే డిసెంబరు 9న తెలంగాణ అనుకూల ప్రకటన వచ్చిందన్నారు. ఆ తర్వాత ప్రజల మనోభావాలను పక్కనబెట్టడంతో ఉద్యమం ఉవ్వెత్తున సాగిందన్నారు. ఆనాడే తెలంగాణను ఇచ్చి ఉంటే విద్యార్థుల బలిదానాలు జరిగేవి కావని హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. ఢిల్లీ కుట్రలను ఛేదించి తెలంగాణకు స్వేచ్ఛావాయువులు ప్రసాదించడానికి కేసీఆర్‌ దీక్షే ప్రధాన కారణమన్నారు.

Updated Date - 2023-11-30T04:05:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising