ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tenth Results : పదో తరగతి ఫలితాలు నేడే.. విద్యార్థులూ ఈ పని మాత్రం చెయ్యకండి..

ABN, First Publish Date - 2023-05-10T10:03:48+05:30

నిన్నటికి నిన్న ఇంటర్ పరీక్షల ఫలితాలు అలా వచ్చాయో లేదో.. ఇలా ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన ఆత్మహత్యల న్యూస్ వరుసబెట్టాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్ : నిన్నటికి నిన్న ఇంటర్ పరీక్షల ఫలితాలు అలా వచ్చాయో లేదో.. ఇలా ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన ఆత్మహత్యల న్యూస్ వరుసబెట్టాయి. పిల్లలు ఎందుకింత సెన్సిటివ్‌గా మారిపోతున్నారు? ఇంటర్‌తోనో లేదంటే పదో తరగతితోనో జీవితం అయిపోయిందా? అసలు రిజల్ట్ వస్తోందంటే కొందరు తల్లిదండ్రులకు గుండె దడ స్టార్ట్ అవుతుంది. ఫెయిల్ అయితే తమ పిల్లలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని.. కొందరు తల్లిదండ్రులు సైతం అలాగే ఉన్నారు. ఏదో తమ పిల్లల జీవితం అక్కడితో అయిపోయినట్టు కేకలు వేస్తారు. కొందరు అలా.. కొందరు ఇలా.. జీవితం అంటే పరీక్షలు.. మార్కులేనా? ఇంకేం లేదా? కేవలం విద్య అనేది విజ్ఞానం కోసం మాత్రమేనని గుర్తుంచుకుంటే చాలు. పదో తరగతి ఫెయిలైన విద్యార్థుల్లో ఎంతో మంది ఉన్నతి స్థితికి చేరుకున్న వారు ఉన్నారు.

ప్రపంచాన్ని నడిపిస్తున్న వారిలో టాపర్స్ ఎవరూ లేరు..

ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రపంచాన్ని నడిపిస్తున్న వారిలో టాపర్స్ కంటే సాదాసీదాగా చదివి అత్తెసరు మార్కులతో పాసైన వారు కొందరు కాగా.. ఇలా పదో తరగతి లేదంటే ఇంటర్ ఫెయిలైన డ్రాపవుట్సే ఎక్కువ అనడంలో అతిశయోక్తి కాదు. బల్బ్‌ను కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్‌కు తల్లే గురువు. స్కూలుకు వెళ్లింది కేవలం కొన్ని నెలలు మాత్రమే. అలాగే ఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్ గ్రాహంబెల్ కూడా పదో తరగతి పాస్ కాలేదు. ఇలా చెప్పుకుంటే పోతే ఎందరో ఉన్నారు. చివరకు అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడైన బిల్ గేట్స్ సైతం డ్రాపవుట్. వీళ్లంతా తమ తెలివితేటలతో గొప్పవాళ్లు అయ్యారు కానీ చదువుతో కాదు. ఇంటర్ పాస్ కాని వారు.. పదో తరగతి పాస్ కాని వారు అద్భుతాలు చేశారు. ఫెయిల్ అయ్యామని బాధ పడాల్సిన పని లేదు.

ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి..

తల్లిదండ్రులు కూడా పిల్లలకు పెద్ద సపోర్ట్‌గా నిలవాలే కానీ మరో విద్యార్థితో కంపేర్ చేసి కోప్పడితే వారిని నష్టపోవాల్సి వస్తుంది. ఒక్కసారి ఫెయిల్ అయితేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. యానువల్ ఎగ్జాంలో ఫెయిలైతే సప్లిమెంటరీ ఉంటుంది. కానీ ప్రాణం పోతే సప్లిమెంటరీ ఉండదన్న విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి. తమను అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు ఒక్కసారిగా తమను కోల్పోతే వారు ఏమవుతారోనని ఒక్కసారైనా ఆలోచించాలి. అసలు నిజానికి ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అంతటి ధైర్యమేదో సమస్యను ఎదుర్కోవడంలోనో.. ఫెయిలైన అనంతరం జీవితాన్ని మలచుకోవడం పైనో పెడితే ఆ తరువాతి జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు పదో తరగతి పరీక్షల ఫలితాలు వెలువడనున్నాయి. కాబట్టి పదో తరగతి విద్యార్థులు దయచేసి మీరు మాత్రం ఫెయిల్ అయితే ఆత్మహత్య జోలికి వెళ్లకండి.

Updated Date - 2023-05-10T10:03:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising