Warangal Medical Student Issue: ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించిన గవర్నర్
ABN, First Publish Date - 2023-02-23T20:34:34+05:30
నిమ్స్ ఆస్పత్రి (Nimes Hospital)కి గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వచ్చారు. నిమ్స్‌లో కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులను గవర్నర్ పరామర్శించారు.
హైదరాబాద్: నిమ్స్ ఆస్పత్రి (Nimes Hospital)కి గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) వచ్చారు. నిమ్స్‌లో కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి కుటుంబ సభ్యులను గవర్నర్ పరామర్శించారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఒక వైద్య విద్యార్థినికి ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఇది చాలా సున్నితమైన అంశమని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరుగుతోందని గవర్నర్ తమిళిసై తెలిపారు.
ప్రీతి హెల్త్ బులిటెన్ విడుదల
వరంగల్ కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి (Preeti) ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ (Health Bulletin) విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ప్రకటించారు. మల్టీ ఆర్గాన్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యాయని వైద్యలు తెలిపారు. ప్రీతికి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఎక్మో సపోర్టు (Ekmo support) తో చికిత్స అందిస్తున్నామని నిమ్స్ (NIMES) వైద్య బృందం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకటించిది. వైద్యుల ప్రకటనతో ప్రీతి కుటుంబసభ్యులు, తోటి విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రీతి త్వరగా కోలుకోవాలని స్నేహితులు కోరుకుంటున్నారు.
Updated Date - 2023-02-23T20:34:35+05:30 IST