ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kunamneni Sambasiva Rao: కార్పోరేట్ అవినీతి పరులపై వేట మొదలుపెట్టాలి.. కూనంనేని డిమాండ్

ABN, Publish Date - Dec 20 , 2023 | 09:43 PM

పేదవాళ్లు సృష్టిస్తున్న డబ్బులు కొంతమంది చేతుల్లోకి వెళ్తోందని.. పేదవారు పేదోళ్లుగానే ఉంటుంటే, కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు ఎలా అవుతున్నారని కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రశ్నించారు. ఈ అంశంలో...

Kunamneni Sambasiva Rao: పేదవాళ్లు సృష్టిస్తున్న డబ్బులు కొంతమంది చేతుల్లోకి వెళ్తోందని.. పేదవారు పేదోళ్లుగానే ఉంటుంటే, కొంతమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు ఎలా అవుతున్నారని కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో ప్రశ్నించారు. ఈ అంశంలో రాజకీయ నాయకులపై అనుమానాలు రేకెత్తుతున్నాయని అన్నారు. జీఎస్టీలో 18లక్షల కోట్లు ఉంటే.. 7 శాతం మాత్రమే కార్పొరేట్‌లు కడుతున్నారన్నారు. మిగిలిన డబ్బంతా పేద, ధనిక వర్గాల వారు కడుతున్నారని చెప్పారు. కాబట్టి.. కార్పోరేట్ అవినీతి పరులపై వేట మొదలుపెట్టాడని డిమాండ్ చేశారు. ఏసీబీ వీరిపై డేగకన్ను వేయాలని, వాటి ఆట కట్టించాలని కోరారు. అప్పు చేయడం నేరమేమీ కాదని.. దాన్ని సరైన విధంగా వినియోగించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పులు పేదవారికి భారం కాకూడదన్నారు.


కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పేరుతో కాంట్రాక్టర్‌లు దోచుకుంటున్నారని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పౌష్టికాహారం లోపంతో ఇంకా చాలామంది చనిపోతున్నారని.. గూడు లేకుండా ఎంతోమంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేస్తున్న అప్పుల డబ్బు ఎటుపోతోందని ప్రశ్నించారు. కనకదుర్గ ముక్కుపుడకకు కూడా సింగరేణి డబ్బే పోయిందని.. సింగరేణి కార్మికులకు జీతాల కోసం ఎందుకు అప్పు చేయాల్సి వస్తోందని అడిగారు. ఇంతలో హరీశ్ రావు మధ్యలో కలగజేసుకోవడంతో.. ‘‘నేను మిమ్మల్ని ఏమీ అన్నాను, నేను మాట్లాడుతుంటే మీరేందుకు అడ్డు పడుతున్నారు’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. తాను రాష్ట్ర ప్రజల కోసం, అందరి పేదవాళ్ళ తరఫున మాట్లాడుతున్నానని కూనంనేని అన్నారు. పేదల బ్రతుకులు బాగుపడాలనేదే తన ఆలోచన అన్నారు. చేసే అప్పులో వారికి కొంతభాగం కేటాయించాలని కోరారు.

Updated Date - Dec 20 , 2023 | 09:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising