ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోగొట్టుకున్న బ్రాస్‌లెట్‌ భక్తుడికి అందజేత

ABN, Publish Date - Dec 15 , 2023 | 12:32 AM

దర్శనానికి వచ్చిన భక్తుడు పోగొట్టుకున్న రెండున్నర తులాల బంగారు బ్రాస్‌లెట్‌ను ఎస్పీఎఫ్‌ సిబ్బంది అందజేసి నిబద్దతను చాటుకున్నారు.

భక్తుడు సాయిదుర్గకుమార్‌కు బ్రాస్‌లెట్‌ను అందజేస్తున్న దేవస్థాన అధికారులు, ఎప్పీఎఫ్‌ సిబ్బంది

నిబద్ధతను చాటుకున్న మహిళా హోంగార్డు

యాదగిరిగుట్ట, డిసెంబరు 14 : దర్శనానికి వచ్చిన భక్తుడు పోగొట్టుకున్న రెండున్నర తులాల బంగారు బ్రాస్‌లెట్‌ను ఎస్పీఎఫ్‌ సిబ్బంది అందజేసి నిబద్దతను చాటుకున్నారు. ఎస్పీఎఫ్‌ జమిందార్‌ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం గురరువారం ఉదయం హయతనగర్‌కు చెందిన సాయిదుర్గ కుమార్‌ కుటుంబసభ్యులతో వచ్చారు. ఉదయం కొండకింద ఆర్టీసీ బస్టాండ్‌లో బస్‌ దిగి కొండపైకి దేవస్థాన ఆధ్వర్యంలో ఆర్టీసీ నడుపుతున్న ఉచిత బస్సులో చేరుకున్నారు. ధర్మదర్శన క్యూలైనలో ప్రధానాలయంలోని స్వయుయంభువులను దర్శించుకుని బయటకువచ్చారు. దర్శన క్యూలైన బయటకు వచ్చే క్రమంలో ఆయన చేతికి ఉన్న రెండున్నర తులాల బ్రాస్‌లెట్‌ కింద పడింది. బయటకు వెళ్లే దర్శన క్యూలైన దారి వద్ద విధులు నిర్వర్తిస్తున్న మహిళా హోంగార్డు మమత బ్రాస్‌లెట్‌ను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం చేరవేసి ఆ బ్రాస్‌లెట్‌ను అందజేసింది. ఎస్పీఎఫ్‌ జమిందార్‌ రామకృష్ణ ప్రధానాలయంలోని మైక్‌ రూమ్‌ ద్వారా భక్తుడు బ్రాస్‌లెట్‌ పోగొట్టుకున్న విషయాన్ని ప్రకటించారు. భక్తుడు సాయు తన చేతి బ్రాస్‌లెట్‌ పోగొట్టుకున్నట్లు గుర్తించి దేవస్థాన ప్రధానకార్యాలయ అధికారులకు వివరాలు తెలిపాడు. దీంతో సదరు భక్తుడికి బ్రాస్‌లెట్‌ను తిరిగి అందజేశారు. విధి నిర్వహణలో నిబద్ధతను ప్రదర్శించిన హోంగార్డు మమతను, ఎస్పీఎఫ్‌ సిబ్బందిని డీఈవో దోర్భల భాస్కరశర్మ, ఏఈవో గట్టు శ్రవణ్‌కుమార్‌లు అభినందించారు.

Updated Date - Dec 15 , 2023 | 12:32 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising