ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy : ఆంధ్రోళ్ల సొమ్ముతో కేసీఆర్‌ పార్టీ

ABN, First Publish Date - 2023-07-16T06:07:53+05:30

కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని ఆంధ్ర నేతలు ఇచ్చిన సొమ్ముతో పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆనాటి టీడీపీ నేత బొజ్జల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇచ్చిన రూ.కోటితో ఏర్పాటు

కేసీఆర్‌ టీడీపీలో ఉన్నప్పుడే బషీర్‌బాగ్‌ కాల్పులు

పోచారం మంత్రిగా, గుత్తా కీలక పదవిలో ఉన్నారు

టికెట్ల కోసం దిగజారుతున్నారు

ఉచిత విద్యుత్తుపై చర్చకు సిద్ధం

24 గంటలు ఇచ్చినట్లు నిరూపిస్తే మేం ఓట్లు అడగం

ఇవ్వకపోతే బీఆర్‌ఎస్‌ ఓట్లు అడగకుండా ఉంటుందా?: రేవంత్‌

హైదరాబాద్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని ఆంధ్ర నేతలు ఇచ్చిన సొమ్ముతో పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆనాటి టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇచ్చిన రూ.కోటితో టీఆర్‌ఎస్‌ పెట్టారని, ఆ డబ్బులతోనే టీఆర్‌ఎస్‌ ఫ్లెక్సీలు, సభ్యత్వ పుస్తకాలను ముద్రించారని తెలిపారు. ఇందుకు సాక్షులు చాలా మంది ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి పదవి కోసం చంద్రబాబు చెప్పులు మోసేందుకు కూడా కేసీఆర్‌ సిద్ధమయ్యారని, 9 నెలలపాటు కేసీఆర్‌కు చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని అన్నారు. ఇందుకు తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వర్‌రావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రత్యక్ష సాక్షులన్నారు. తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పుకొన్న కేసీఆర్‌.. 2009లో మళ్లీ చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉచిత విద్యుత్తుపై రిఫరెండం పెడదామంటూ మంత్రులు, బీఆర్‌ఎస్‌ నేతలు చేసిన సవాల్‌ను ఆయన స్వీకరించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు పంపిణీపై రాష్ట్రంలోని సబ్‌స్టేషన్ల వద్ద చర్చకు సిద్ధమా అంటూ ప్రతిసవాల్‌ విసిరారు. తమ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సబ్‌స్టేషన్‌ లాగ్‌బుక్స్‌ను చూపించి 24 గంటల కరెంటు రాని విషయాన్ని నిరూపించారని గుర్తు చేశారు. ‘‘రాష్ట్రంలోని ప్రతి సబ్‌స్టేషన్‌ వద్ద గ్రామసభలు, రచ్చబండ నిర్వహించి రైతులతో చర్చ పెడదాం. బీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నట్లుగా 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు ఇచ్చిన సబ్‌స్టేషన్ల పరిధిలో కాంగ్రెస్‌ ఓట్లు అడగదు. ఇవ్వని సబ్‌స్టేషన్ల పరిధిలో బీఆర్‌ఎస్‌ ఓట్లు అడగొద్దు. ఈ సవాల్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు సిద్ధమా?’’ అని రేవంత్‌ అన్నారు. కొడంగల్‌లో తాను, అలంపూర్‌లో సంపత్‌కుమార్‌, వనపర్తిలో చిన్నారెడ్డి, నాగర్‌ కర్నూలు లోక్‌సభ పరిధిలో మల్లు రవి చర్చకు వస్తారని రేవంత్‌రెడ్డి ప్రకటించారు.

ఆనాడు టీడీపీలో కీలక పదవిలో కేసీఆర్‌..

దేశంలో ఏ పార్టీ ఆలోచన చేయకముందే రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందించిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 1999 ఎన్నికల మేనిఫెస్టోలోనే ఉచిత విద్యుత్తు అంశాన్ని పార్టీ పెట్టిందని గుర్తు చేశారు. విద్యుత్తు చార్జీలకు వ్యతిరేకంగా చేపట్టిన చలో అసెంబ్లీపై బషీర్‌బాగ్‌ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు రైతులు మరణించారని, అనేక మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ పాలసీలను రూపొందించే హెచ్‌ఆర్డీ విభాగానికి కేసీఆర్‌ చైర్మన్‌. అప్పుడు పోచారం శ్రీనివా్‌సరెడ్డి మంత్రిగా, గుత్తా సుఖేందర్‌రెడ్డి కీలక పదవిలో ఉన్నారు. వీళ్లంతా చంద్రబాబుతో కలిసి విద్యుత్తు పాలసీని తయారు చేశారు. మరి బషీర్‌బాగ్‌ కాల్పులకు కేసీఆర్‌, పోచారం, గుత్తా కారణం కాదా?’’ అని రేవంత్‌ ప్రశ్నించారు. నాడు కేసీఆర్‌ డిప్యూటీ స్పీకర్‌గా కూడా ఉన్నారని గుర్తు చేశారు. బషీర్‌బాగ్‌ కాల్పులు జరిగింది 2000 సంవత్సరంలో అయితే.. తాను టీడీపీలో చేరింది 2007లోనని రేవంత్‌ తెలిపారు. అలాంటిది తాను ఎలా బాధ్యుడిని అవుతానో, కేసీఆర్‌ ఎలా బాధ్యుడు కాదో మంత్రి హరీశ్‌ చెప్పాలన్నారు.

బొగ్గు గనుల వద్ద విద్యుత్తు ప్లాంట్లేవి?

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన 9 గంటల ఉచిత కరెంటునే 2018 వరకు విడతల వారీగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు. ఛత్తీ్‌సగఢ్‌లో 24 గంటల విద్యుత్తు ఎందుకు ఇవ్వడంలేదన్న బీఆర్‌ఎస్‌ నేతల వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘కేసీఆర్‌ పుట్టిన చింతమడకలో ఇంటికి రూ.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. మరి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎందుకు ప్రకటించలేదు? రాష్ట్రాలను బట్టి ప్రాథమ్యాలు మారుతుంటాయి’’ అని రేవంత్‌ అన్నారు. విద్యుత్తు కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలపై త్వరలోనే విద్యుత్తు ఫైల్స్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. పోచారం, గుత్తా సుఖేందర్‌రెడ్డికి వయసు పెరిగింది తప్ప.. బుద్ది పెరగలేదని రేవంత్‌ అన్నారు. స్పీకర్‌, చైర్మన్‌ పదవుల్లో ఉన్నవారు రాజకీయాలకు అతీతంగా ఉండాలని, కానీ.. వారు ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు చేస్తూ... కేసీఆర్‌ బూట్లు నాకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోచారం కుమారులు కంకర నుంచి ఇసుక వ్యాపారం దాకా చేయని దందా లేదన్నారు. బీఆర్‌ఎస్‌ పాలన అద్భుతమే అయితే.. 104 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వాలని, కేసీఆర్‌ గజ్వేల్‌ నుంచే పోటీ చేయాలని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. గజ్వేల్‌లో కేసీఆర్‌, 104 మంది ఎమ్మెల్యేల్లో 80 శాతం మంది ఓడిపోతున్నట్లు సర్వే ల్లో తేలిందని, అందుకే కేసీఆర్‌ పక్క నియోజకవర్గాలు వెతుక్కుంటున్నారని అన్నారు.

ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండల అధ్యక్షుడి మార్పును వ్యతిరేకిస్తూ పలువురు నేతలు, కార్యకర్తలు గాంధీభవన్‌ మెట్లపై ఆందోళన చేశారు. దీంతో ఆ ఒక్క మండలాన్ని మహిళకు ఇస్తే వ్యతిరేకించడమేంటని రేవంత్‌ సీరియస్‌ అయ్యారు. ఇకపై గాంధీభవన్‌ మెట్లపై ఇలా చేస్తే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. అభ్యంతరాలుంటే టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌కు వినతిపత్రం ఇవ్వాలన్నారు. కాగా, అసైన్డ్‌ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్న చోట్ల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించింది.

వైఎస్‌ ఉండి ఉంటే టీఆర్‌ఎస్‌ను హరీశ్‌ కాంగ్రెస్‌లో విలీనం చేసేవారు

మీడియాతో చిట్‌చాట్‌లో రేవంత్‌

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉన్నట్లయితే టీఆర్‌ఎస్‌ పార్టీని హరీశ్‌రావు కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేవారని, దేశంలో మొదటి ఏక్‌నాథ్‌ షిండే అయ్యేవారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ.. వైఎ్‌సఆర్‌ రచ్చబండ కార్యక్రమం తర్వాత కాంగ్రె్‌సలో చేరేందుకు హరీశ్‌రావు ముహూర్తం పెట్టుకున్నారని తెలిపారు. ఎవరూ లేకుండా హరీశ్‌ ఒక్కరే వైఎ్‌సఆర్‌ను కలిశారని, పార్టీ కార్యాలయాన్ని సైతం స్వాధీనం చేసుకోవడానికి ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందిందన్నారు. ఆనాడు వైఎ్‌సఆర్‌ చనిపోకపోతే ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఉండేది కాదన్నారు. రేపు బీఆర్‌ఎ్‌సకు 50 కంటే తక్కువ సీట్లు వస్తే హరీశ్‌ కేసీఆర్‌తో ఉండబోరని జోస్యం చెప్పారు. సర్కారు ఏర్పాటు చేయడానికి మ్యాజిక్‌ ఫిగర్‌ 60 అని గుర్తుచేసిన రేవంత్‌.. బీఆర్‌ఎ్‌సకు 55 సీట్లు వస్తాయని ఆ పార్టీ వాళ్లే చెబుతున్నారన్నారు. తన లెక్క ప్రకారం బీఆర్‌ఎ్‌సకు 25 సీట్లు దాటవన్నారు. యూసీసీతో ముస్లింల కంటే గిరిజనులే ఎక్కువగా నష్టపోతారన్నారు.

Updated Date - 2023-07-16T06:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising