ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TSPSC Leak: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ సిట్ ద్వారా పూర్తిగా బయటపడదు: రేవంత్‌

ABN, First Publish Date - 2023-03-21T18:52:30+05:30

టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్‌ లీకేజీ సిట్ ద్వారా పూర్తిగా బయటపడదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్‌ లీకేజీ సిట్ ద్వారా పూర్తిగా బయటపడదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. సిట్ అంటేనే సిట్ అండ్ స్టాండ్ మాత్రమేనని ఎద్దేవాచేశారు. గతంలో సిట్ వేసిన కేసులన్నీ ఎక్కడపోయాయి? ప్రశ్నించారు. పేపర్ లీకేజీ అంశం ప్రవీణ్, రాజశేఖర్‌కే పరిమితం కాదని, చైర్మన్, సెక్రెటరీలు, శంకర్‌లక్ష్మిని కూడా బాధ్యులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఓనర్ చైర్మన్, సెక్రెటరీలు అయితే కాపలాదారు శంకర్‌లక్ష్మి.. ప్రవీణ్, రాజశేఖర్‌ పనివాళ్లు మాత్రమేనని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ లోని సిస్టమ్‌ల బాధ్యత ఐటీ శాఖ పరిధిలోనిదే స్పష్టం చేశారు. ఐటీ అంతా మంత్రి కేటీఆర్ (Minister KTR) చేతిలోనే ఉంటుందని, పేపర్‌ లీక్‌ కేసును పనివాళ్లతోనే క్లోజ్‌ చేసే కుట్ర చేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మానియా వర్సిటీలో జరగనున్న నిరుద్యోగుల నిరసన దీక్షకు రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. టీఎస్‌పీఎస్సీ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, కొత్త కమిషన్‌ను నియమించాలని, రద్దయిన పరీక్షలకు సంబంధించి అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లించాలన్న డిమాండ్లతో ఈ నెల 24, 25 తేదీల్లో ఐక్య విద్యార్థి సంఘాలు దీక్ష తలపెట్టాయి. ఈ క్రమంలోనే దీక్షకు సంఘీభావం తెలిపేందుకు 24న రేవంత్‌ అక్కడికి వెళ్లనున్నారు.

రేవంత్‌రెడ్డికి సిట్‌ నోటీసులు

రేవంత్‌రెడ్డికి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసుకు సంబంధించి ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. ఈ నెల 19న కామారెడ్డి జిల్లా గాంధారిలో జరిగిన కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. లీకేజీ వెనకాల ఎవరెవరు ఉన్నారనేది తన వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. దీనికి స్పందించిన సిట్‌.. ఆధారాలను తమకు సమర్పిస్తే దర్యాప్తునకు ఎంతో తోడ్పతాయని పేర్కొంది. ఆ ఆధారాలతో 23న తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. కాగా, రేవంత్‌ ఇంట్లో లేకపోవడంతో సిట్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌రావు నోటీసును ఇంటి గుమ్మం వద్ద అంటించి వెళ్లిపోయారు.

Updated Date - 2023-03-21T18:52:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising