ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీకి విజయశాంతి రాజీనామా!

ABN, First Publish Date - 2023-11-16T03:16:11+05:30

ప్రముఖ సినీ నటి, బీజేపీ ముఖ్యనేత విజయశాంతి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపారు.

కమలం నేతల వైఖరిపై తీవ్ర అసంతృప్తి

కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరం

ఎల్లుండి రాహుల్‌ గాంధీ సమక్షంలో

కాంగ్రెస్‌ పార్టీలో చేరిక?

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ నటి, బీజేపీ ముఖ్యనేత విజయశాంతి బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు తన రాజీనామా లేఖను పంపారు. కొన్ని రోజుల క్రితం వరకు బీజేపీలో క్రియాశీలంగా వ్యవహరించిన విజయ శాంతి పార్టీ నేతలు తనపట్ల అవలంబిస్తున్న వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పలు సందర్భాల్లో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించడానికి ప్రయత్నించినా ససేమిరా అంటూ... పార్టీ కార్యకలాపాల్లో అంటీ ముట్టనట్టు వ్యవహరించారు. ఎన్నికల ప్రచార బహిరంగ సభల్లో పాల్గొనేందుకు ఇటీవల రాష్ట్రానికి వచ్చిన పార్టీ అగ్ర నేతలు అమిత్‌షా, ప్రధాని నరేంద్ర మోదీలతో సైతం భేటీ కావడానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఆమె బీజేపీకి రాం.. రాం చెప్పడం ఖాయమని స్పష్టమైంది. ఎల్లుండి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కాగా, విజయశాంతి బీజేపీని వీడుతున్నట్లు ఆంధ్రజ్యోతి ముందే పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated Date - 2023-11-16T03:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising